పవన్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాడమే తన లక్ష్యం: బండి రాధమ్మ
Spread the love

జనసేన పార్టీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న పవన్‌ కల్యాణ్‌ మరికాసేపట్లో జనతరంగం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జనసేన జనతరంగం కార్యక్రమం ఏపీ వ్యాప్తంగా కొనసాగనుంది. రాష్ట్ర, దేశ అభివృద్ధితో జసేనను, యువతను భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. జనతరంగం కార్యక్రమానికి యువత ముందుకు రావాలని ఫేస్‌బుక్‌ వేదికగా పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. ఈ పిలుపు మేరకు పవన్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాడమే తన లక్ష్యం అని జనసేన వీర మహిళ సైనికురాలు బండి రాధమ్మ అన్నారు.