ప్రత్యర్థి గుండెల్లో గుబులు రేకెత్తిస్తుoదాని జనసేన పార్టీ: కో ఆర్డినేటర్లు
Spread the love

జనసేన పార్టీ సిద్దాంతాలకు ప్రజలు ఆకర్షితులై చాపకింద నీరులా పార్టీ బలోపేతం అవుతుందని ఇది ఇతర పార్టీల గుండెల్లో గుబులు రేకెత్తిస్తుందని జనసేన నియోజకవర్గ కో ఆర్డినేటర్లు బండారు శ్రీనివాస్, సంగీత సాయి గుణరంజన్ లు అన్నారు. మండల కేంద్రంలోని రాజు గారి దివాణంలో జరిగిన జనసేన మండల సమావేశంలో మండల నాయకులు కొత్తపల్లి నగేష్ అధ్యక్షతన జరిగిన సభలో బుధవారం వారు పాల్గొని మాట్లాడాటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 25న జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన ప్రజా పోరాట యాత్రలో భాగంగా భారీ బహిరంగ సభలో జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కులాలని కలిపే ఆలోచన విధానం జనసేన పార్టీ దని పేర్కొన్నారు. మతాల ప్రస్తావన లేని రాజకీయం తమ నాయకుడుపవన్ తో సాధ్యమన్నారు. జిల్లా లో మూడవ విడత యాత్ర లో భాగంగా జిల్లాలో రావులపాలెం లో నిర్వహించే బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారని అన్నారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో ఆటోలద్వారా ప్రచారం నిర్వహించి జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొనేలా కృషి చేయాలని కోరారు. అనంతరం నర్సిపూడి కి చెందిన మద్దూరి పవన్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 12 మంది యువకులు పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జనసేన వీర మహిళ బండి రాధమ్మ, ఎర్ర నాగబాబు, తోట వెంకటేశ్వర్లు, తాళ్ల డేవిడ్ రాజు, నరాల నారాయణ, ఎలుగుబంట్ల సాయి,మండల జనసేన నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.