ప్రత్యేకహోదాకు నిరసన తేలుతున్న నేతలకు మద్దతు తెలిపిన పవన్..
Spread the love

వామపక్ష నేతలు, విద్యార్థి సంఘాలు ఢిల్లీలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సాయంత్రం పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించగా ఢిల్లీ పోలీసులు నేతలను అరెస్ట్ చేసి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో నిరసన కొనసాగిస్తున్న నేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి మద్దతు తెలియజేయడం జరిగింది. వామపక్ష నేతలు రామకృష్ణ, మధుతో ఫోన్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ హోదా కోసం పోరాటం చేస్తున్న కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని ఖండించారు. ప్రత్యేక హోదా కోసం చేస్తున్న వారి పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేసారు.