చేయి చేయి క‌లిపిన NRI జ‌న‌సైనికులు…
Spread the love

భావ‌న వెంక‌టేష్‌..జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వీరాభిమాని.జ‌న‌సేనాని జ‌న్మ‌దినోత్స‌వ౦ సందర్భంగా బాణ‌సంచా కాల్చుతుండ గా ప్ర‌మాద‌వ‌శాత్తు చేతిని కోల్పోయాడు భ‌గ‌త్‌సింగ్ విద్యార్ధి విభాగం స‌భ్యుడు భావ‌న వెంక‌టేష్‌ చిన్నత‌నంలోనే త‌ల్లిదండ్రుల్ని కోల్పోయిన వెంక‌టేష్‌కి అనుకోని క‌ష్టం వ‌చ్చింది.వెంక‌టేష్ విష‌యం తెలుసుకున్న జ‌న‌సేన పార్టీ రాజ‌కీయ కార్య‌ద‌ర్శి పి.హ‌రిప్ర‌సాద్‌ అత‌నికి ఆప‌న్న‌హ‌స్తం అందించ‌మంటూ ప‌వ‌న్‌టుడే ద్వారా పార్టీ శ్రేణులను విజ్ఞప్తి చేసారు.హ‌రిప్రసాద్ పిలుపు అందుకున్న జ‌న‌సేన NRI విభాగం త‌మ వంతు సాయాన్ని వెంక‌టేష్‌కి అందించారు.

NRI జ‌న‌సేన అమెరికా విభాగం నుంచి 46 మంది జ‌న‌సైనికులు సాటి జనసేన కార్య‌క‌ర్త‌కి ఆప‌న్న‌హ‌స్తం ఇచ్చేందుకు ముందుకి వ‌చ్చారు.15 అమెరిక‌న్ డాల‌ర్ల నుంచి 100 అమెరికన్ డాల‌ర్ల వ‌ర‌కు ఎవ‌రికి తోచిన సాయం వారందించారు. వీరితో పాటు NRI జ‌న‌సేన మ‌స్క‌ట్ విభాగం మ‌రో 10 వేల రూపాయిలు సాయంగా అందించగా…మొత్తం క‌లిపి ల‌క్షా 70 వేల ఆర్ధిక సాయాన్ని వెంక‌టేష్ కోసం పంపారు.

NRI విభాగం నుంచి అందిన సాయంతో పాటు గోదావ‌రి జిల్లాల‌కి చెందిన కొంద‌రు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు కూడా అత‌ని సాయం అందిచారు.ప్రమాదంలో గాయపడిన వెంక‌టేష్‌ అర‌చేతిని తీసివేయాల్సి రావ‌డంతో దానికి ప్ర‌త్యామ్నాయంగా కృత్రిమ చేతిని ఏర్పాటు చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.భావ‌న వెంక‌టేష్‌కి ఎలాంటి అవ‌స‌ర‌మైనా అండ‌గా వుంటామంటూ స్థానిక జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ముందుకి వ‌చ్చారు.