పలివేలలో జనసేన జనతరంగం సిద్ధాంతాల కార్యక్రమం…
Spread the love

తూర్పుగోదావరి జిల్లా పలివేలలో జనసేన జన తరంగం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జనతరంగం కార్యక్రమంలో  జనబాట కో ఆర్డినేటర్ యర్ర నాగబాబు గారు పాల్గొన్నారు. జనతరంగంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ జనసేన నాయకులు జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన అధినేత శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారి తోనే రాష్ట్రాభివృద్ది సాధ్యమని ఆ పార్టీ నాయకులు అన్నారు. పవన్‌ కళ్యాణ్ గారు చేపట్టిన జనతరంగం కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని అన్నారు. జనసేన పార్టీ ప్రవేశపెట్టనున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసేందుకు సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుని ఏర్పాటు చేసిన ఈ జన తరంగాలు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.