పవన్‌ కళ్యాణ్‌ గారి తోనే రాష్ట్రాభివృద్ది…
Spread the love

జనసేన అధినేత శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారి తోనే రాష్ట్రాభివృద్ది సాధ్యమని ఆ పార్టీ వీరమహిళా నాయకురాలు బండి రాధమ్మ గారు అన్నారు. జనతరంగం కార్యక్రమంలో భాగంగా కొత్తపేట మండలంలోని వానపల్లి, గంటి పెద్దపూడి గ్రామాల్లో పర్యటించి ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ సిద్దాంతాలను వివరించడం జారిగింది. జనసేన పార్టీ అధినేత పవన్‌ చేపట్టిన జనతరంగం కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని అన్నారు. జనసేన పార్టీ ప్రవేశపెట్టనున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసేందుకు సోషల్‌ మీడియా వేదికగా చేసుకుని ఏర్పాటు చేసిన ఈ జన తరంగాలు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించడంపై హర్షం వ్యక్తం చేసారు. ప్రధానంగా యువత ప్రతీ గ్రామంలోని ప్రజలను చైతన్యవంతులను చేయడంతో పాటు ప్రజలందరికీ జనసేన మేనిఫెస్టోను వివరించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జనసైనికులు కృషి చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో గనిశెట్టి నగమల్లేస్, బద్రి నాయుడు, బండారు శ్రీను, మధు తదితరులు పాల్గొనడం జరిగింది.