రైతులతో మమేకమైన జనసేన నాయకులు అశోక్ బాబు…
Spread the love

రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు, కౌలు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని తుని నియోజకవర్గ జనసేన నాయకులు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు స్పష్టం చేశారు. జన తరంగం కార్యక్రమాల్లో భాగంగా జనసేన పార్టీ శ్రేణులతో కలిసి అశోక్ బాబు రైతు బజార్ లో రైతులతో మమేకమయ్యారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రైతులకు మేలు జరుగుతుందని ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ నాయకులు చోడిశెట్టి గణేష్,అంకంరెడ్డి సత్యనారాయణ, బోనం చినబాబు, డి చిరంజీవి రాజు, శ్రీనివాసరాజు, డి వెంకట రాజు తదితరులు పాల్గొనడం జరిగింది.