నేడు చిత్తూరు, నెల్లూరు జిల్లా నేతలతో పవన్ సమీక్ష…
Spread the love

ఎన్నికల కోసం సమాయత్తమయ్యే చర్యలలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గారు జిల్లాల వారీగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా నేడు చిత్తూరు, నెల్లూరు జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. వరుసగా జిల్లాల వారీగా ఈ నెల 9వరకూ పవన్ కళ్యాణ్ గారు సమీక్షలు నిర్వహిస్తారు. వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ వామపక్షాలతో మాత్రమే పొత్తు పెట్టుకుంటుందని ఇప్పటికే పవన్ కల్యాణ్ గారు స్పష్టం చేశారు. అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన 175 స్థానాలకూ పోటీ చేస్తుందని కూడా పవన్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.