జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్…
Spread the love

జనసేన పార్టీ ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. ఈసమావేశంలో స్థానిక నాయకులు జిల్లా జరుగుతున్న పార్టీ కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ గారికి వివరించగా జనసేనకు విశేషంగా ఉన్న యువశక్తిని రాజకీయ శక్తిగా మార్చాలని పవన్ కళ్యాణ్ గారు జిల్లా నాయకులకు సూచించారు. పార్టీ వర్కింగ్ క్యాలెండరుకు రూపకల్పన చేస్తామని.. జిల్లా కమిటీలు సమర్ధవంతంగా పనిచేయాలని పవన్ కళ్యాణ్ కోరారు. వ్యక్తిగతంగా కాకుండా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించిన పవన్ పార్టీ ప్రతినిధిగా బహిరంగంగా మాట్లాడేటప్పుడు సంస్కారవంతమైన బాష మాట్లాడాలని.. పార్టీ నియమావళికి అనుగుణంగా అభిప్రాయాలు ఉండాలని కోరారు.