జనసేన మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్కు ఆకర్షితులవుతున్న కడప జిల్లా వాసులు…
Spread the love

కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం, చీమకుర్తి మండలంలో గల గోనుగుంట గ్రామంలో జనసేన తరంగం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసైనికులు ప్రతీ ఇంటికి తిరిగి జనసేన సిద్ధాంతాలను మరియు మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ లో గల అంశాలను వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు ఎంతో నిబద్దతతో ప్రతీ ఇంటి తలుపు తట్టి వారికి మేనిఫెస్టో అంశాలను వివరించడమే కాకుండా వారిని మెప్పించి జనసేన సభ్యత్వం తీసుకునేలా కృషి చేశారు. దీనికి ప్రజలుకూడా స్వచందంగా అంగికరించి జనసేన పార్టీకి ఆకర్షితులవుతున్నారు, స్థానిక జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.