తుది రూపు దిద్దుకున్న  జనసేన మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ !!
Spread the love

జనసేన మేనిఫెస్టో పార్టీ సిద్ధాంతాలకు అద్దంపడుతూ.. ప్రజా క్షేమం, అభివృద్ధి పరమావధిగా, మానవీయ కోణంతో ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఆ ఆదేశాలకు అనుగుణంగా మేనిఫెస్టో రూపకల్పన బృందంతో పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (ప్యాక్) చర్చించింది. ఈ సమావేశాల్లో ప్యాక్ కన్వీనర్ మాదాసు గంగాధరం, ప్యాక్ సభ్యులు తోట చంద్రశేఖర్, మారిశెట్టి రాఘవయ్య, అర్హం యూసుఫ్, అశోక్ పాల్గొన్నారు. మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ కు తుది రూపు ఇచ్చేందుకు ఈ సమావేశం ఏర్పాటయింది. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఏడు సిద్దాంతాల్లోని స్ఫూర్తి ప్రతి అంశంలోనూ ఉంటుంది. మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలు, ప్రాధాన్యాలపై చర్చించాం. ప్రస్తుతం ఉన్న సమస్యలు, వాటికి చేపట్టాల్సిన పరిష్కారాలు, పథకాలు అమలులో లోపాలు, సంక్షేమానికి ఉద్దేశించిన పథకాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్న తీరు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. విజన్ డాక్యుమెంట్ అనేది మేనిఫెస్టో రూపకల్పనకు ఒక దిక్సూచిగా ఉపయోగపడాలని ప్యాక్ సభ్యులు అభిప్రాయపడ్డారు.

రాయలసీమ జిల్లాలతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పార్టీ వ్యవహారాల పరిశీలనకు కమిటీని ఏర్పాటు చేయాలని ప్యాక్ సమావేశంలో నిర్ణయించాం. ఈ ఆరు జిల్లాల్లో పార్టీ కార్యక్రమాల పరిశీలన, సమీక్షలు చేసి ఆ కమిటీ ప్యాక్ కు నివేదిక ఇస్తుంది. రాష్ట్ర స్థాయి సమన్వయకర్తలు, జిల్లా కో ఆర్డినేటర్లు, జాయింట్ కో ఆర్డినేటర్లతో త్వరలోనే ఒక సమావేశాన్ని నిర్వహించాలని ప్యాక్ సమావేశంలో నిర్ణయించాం. బూత్ స్థాయి వరకూ పార్టీ కార్యక్రమాలను నూతనోత్తేజంతో చేసేందుకు అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికను తెలియచేసి అందుకు అనుగుణంగా దిశానిర్దేశం చేస్తారు.