ఇమ్రాన్ ఖాన్  పై . . . మాజీ భార్య సంచలన వాక్యాలు !
Spread the love

రాజకీయ నాయకుడు ఎవరైనా సరే ఎన్నికలు చాలా ముఖ్యం. కీలకమైన వేళ ఏ చిన్న తేడా వచ్చినా జరిగే నష్టం అపారం. అందుకే ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. అలెర్ట్ గా ఉంటారు. పాక్ మాజీ క్రికెటర్.. ఆ దేశానికి క్రికెట్ వరల్డ్ కప్ ను అందించిన కెప్టెన్ గా చరిత్రలో నిలిచి.. పాలిటిక్స్ లోకి ఎంటర్ కావటంతో సెకండ్ ఇన్నింగ్స్ ను షురూ చేశారు ఇమ్రాన్ ఖాన్.

 

క్రికెట్ లో అలవోకగా విజయాలు సాధించిన ఇమ్రాన్.. రాజకీయరంగంలో మాత్రం ఇప్పటివరకూ సరైన విజయాన్ని సాధించలేదు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే వేళలో.. ఆయన మాజీ భార్య చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

రాజకీయ రంగంలో మాదిరే.. వైవాహిక జీవితంలో వరుస ఫెయ్యిలర్స్ చవిచూసిన ఇమ్రాన్ కు తాజాగా ఆయన మాజీ భార్య కమ్ జర్నలిస్ట్ రేహమ్ ఖాన్ పుణ్యమా అని ఎంత దారుణమైన డ్యామేజ్ జరగాలో అంత డ్యామేజ్ జరిగిపోతోంది. తన ఆత్మకథను పుస్తక రూపంలో రాస్తున్న రేహామ్ ఇప్పటికే పలు సంచలన.. వివాదాస్పద అంశాల్ని తన పుస్తకంలో రాస్తున్న వైనం ఈ మధ్యన ఆన్ లైన్ లీక్ పుణ్యమా అని బయటకు వచ్చింది.

తాజాగా.. తన మాజీ భర్త ఇమ్రాన్ మీద సంచలన ఆరోపణ చేసింది. ఇమ్రాన్ గే అని.. అతడికి పలువురు మగాళ్లతో సంబంధాలు ఉన్నట్లు ఆమె బాంబు పేల్చారు. అంతేనా.. తనను లైంగికంగా వేధించినట్లు ఆమె చెబుతున్నారు. నటుడు హమ్జా అలీ అబ్బాసీతో పాటు.. ఇమ్రాన్ పార్టీ (పాకిస్థాన్ తెహ్రీక్ – ఎ – ఇన్సాఫ్) సభ్యుడు మురాద్ సాయిద్ లు ఇమ్రాన్ హోమోసెక్సువల్ భాగస్వామ్యులుగా ఆమె పేర్కొన్నారు.

తాను చెబుతున్న విషయాల్ని తన ఆత్మకథలో రాయనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఇమ్రాన్ హోమో సెక్సువల్ భాగస్వామిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మురాద్.. రేహమ్ ఖాన్ వ్యాఖ్యల్ని ఖండించారు. రోత మనుషులు చేసే ఆరోపణలకు తాను స్పందించనన్నారు.

రేహామ్ ఎవరి చేతులోనో పావుగా మారిందని.. ఆ ఆరోపణలు చేస్తున్న ఆమెకు ఆ విషయం తెలుసన్నారు. మరోవైపు ఇమ్రాన్ పై రేహమ్ మరిన్ని ఆరోపణల్ని దట్టిస్తున్నారు. ఇమ్రాన్ తో పెళ్లికి  ముందు లైంగిక వేధింపులకు గురి చేశాడని.. అయితే.. తాను పెళ్లి చేసుకోనున్నట్లుగా సర్ది చెప్పాడని ఆమె చెప్పారు. పెళ్లికి ముందు లైంగిక వేధింపులకు గురి చేసిన వ్యక్తితో రేహాన్ జీవితాన్ని ఎందుకు పంచుకోవాలనుకున్నట్లు?