జనసేన  జనతరంగంలో పాల్గొంటూ ఆదర్శంగా నిలుస్తున్న దివ్యాంగుడు..
Spread the love

నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం కొండగుంట గ్రామంలో గల ఒక దివ్యాంగుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. జనసేన తరంగం కార్యక్రమంలో పాల్గొని ప్రతీ ఇంటికీ వీల్ చైర్ లో తిరుగుతూ జనసేన సిద్ధాంతాలను మరియు మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ లోని అంశాలను వివరిస్తున్నారు. ప్రజలకు అండగా నిలిచేందుకు పోరాడుతున్న జనసేన పార్టీకి సహాయపడేందుకు తన అంగవైకల్యం అడ్డుకాదని చాటి చెప్తున్న ఆ వ్యక్తిని పలువురు అభినందిస్తున్నారు. పోరాటయాత్రలో భాగంగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పలు చోట్ల దివ్యాంగులతో సమావేశమయ్యి వారికి అవసరమైన సదుపాయాలు కల్పిస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది. దివ్యాంగులకు ప్రతీ నెల 5000 – 10000 వరకు ఫించన్ మరియు వారి కొరకు ప్రత్యేక సదుపాయాలతో ఇళ్లను నిర్మించి అండగా నిలుస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది.