జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రావాలని కోరుతూ
Spread the love

: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రావాలని కోరుతూ గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం మృత్యుంజయపురం గ్రామానికి చెందిన మువ్వా పెదకోటేశ్వరరావు మంగళవారం కోటప్పకొండ మెట్లను మోకాళ్లతో ఎక్కారు. రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రావాలని, వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు, ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు విజయం సాధించాలని ఆకాక్షించారు. దాదాపు 730 మెట్లను ఆయన మోకాళ్లతో ఎక్కారు. మోకాళ్లు తీవ్రంగా బాధిస్తున్నా లెక్కచేయకుండా ఆయన మొక్కును చెల్లించుకున్నారు. జగన్‌ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని తెలిపారు. బలహీన వర్గాలకు జగన్‌ న్యాయం చేస్తాడని కోరుకుంటున్నట్టు వివరించారు.