ప్రజలకు మంచి చేసే పార్టీ ఒకేఒక పార్టీ జనసేన పార్టీ: మాజీ ఎమ్మెల్యే రాజ అశోక్ బాబు
Spread the love

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జన సైనికులు నిరంతరం పాటుపడాలని జనసేన నేత మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు గారు జన సైనికులకు పిలుపునిచ్చారు. స్థానిక కిరణ వర్తక సంఘం కళ్యాణ మండపంలో సోమవారం సాయంత్రం తుని నియోజకవర్గ జనసేన కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అశోక్ బాబు గారు మాట్లాడుతూ జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ విశ్వసనీయత ప్రజలకు ఎంతో మేలు చేస్తాయన్నారు. తాను ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశామని, మనల్ని నమ్మి ప్రజలు పట్టం కడితే బాధ్యతాయుతంగా పని చేసామని అన్నారు. ప్రజల ఆశయాలను ఆశలను ఎప్పుడూ ఓమ్ము చేయరాదని ఆయన పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడడం తో పాటు, విద్య వైద్యం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించి నియోజకవర్గాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేశామని అన్నారు. కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటానని, సమయాన్ని వృధా చేయకుండా పార్టీ అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమేనని వాటిని పట్టించుకోకుండా మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో అభివృద్ధి ఏమి లేదని, ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పంతోనే తాను జనసేనను వేదికగా ఎంచుకున్నట్లు అశోక్ బాబు గారు వివరించారు.