భారత్‌-పాక్‌ సంబంధాల మధ్యలో   చైనా !!
Spread the love

భారత్‌-పాకిస్తాన్‌ దేశాల మధ్య మ౦చి  సంబంధాలను బలోపేతం చేయడంలో చైనా అనుకూల౦గా , నిర్మాణాత్మక పాత్ర వహిస్తు౦దని  చైనా విదేశాంగ ప్రతినిధి లూకుంగ్‌ వెల్లడి౦చారు. ఆసియాలో భారత్‌, పాకిస్తాన్‌లు బలమైనా దేశాలని, ఇక  ఆ రెండు దేశాల మధ్య స్నేహపూర్వకమైన సంబంధాలు మెరగుపడాలని ఆయన తేలియజేసారు. భారత్‌-పాక్‌ మధ్య అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేయడంలో భవిష్యత్తులో చైనా కీలక పాత్ర పోషించనున్నట్లు లూకుంగ్‌ తెలిపారు.

అయితే పాక్‌ నూతన ప్రధానిగా ఎన్నికైన ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పాక్‌ ప్రభుత్వంతో తాము చర్చలు జరిపేందుకు సిద్దం అని ,  ఇక భారత్‌-పాక్‌ సత్సబంధాలను చైనా ఎల్లప్పుడూ కోరుకుంటుందని ఆయన అన్నారు. రెండు దేశాలు ‍మధుర స్నేహం అభివృద్ధి, శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుకు దోహదం చేస్తుందని చెప్పారు.  చైనాకు పొరుగుదేశాలైన భారత్‌-పాక్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాల పెరుగుదలకు చైనా రెండు దేశాలకు మద్దతునిస్తుందని.. ఇరు దేశాల మధ్య ఉన్న వైరుధ్యాలను పరిష్కరించడానికి తాము ప్రయత్నిస్తామని వెల్లడి౦చారు. భారత్‌, పాక్‌ల మధ్య నిర్మాణాత్మక, అర్ధవంతమైన చర్చలు జరగాలని పాక్‌ నూతన ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లేఖ రాసినట్లు లూకుంగ్‌ గుర్తుచేశారు. కాగా భారత్‌-పాక్‌ సంబంధాల మధ్య ఇమ్రాన్‌ ఖాన్‌ ఆసక్తి చూపుతున్నట్లు చైనా ప్రకటించింది.  ఈ నేపథ్యంలో రెండు దేశాలు కోరుకుంటే ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వంగా వ్యవహరించడానికి చైనా రెడి గా  ఉందని పేర్కోన్నారు.