రాబోయే ప్రభుత్వంలో జనసేన దే కీ రోల్.. నెక్ట్స్ సీఎం డిసైడ్ చేసేది పవన్ కళ్యాణే అంటున్న హైపర్ ఆది..
Spread the love

2019 ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు చెందిన జనసేన పార్టీ సపోర్ట్ లేనిదే ఏ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని జబర్ధస్త్ యాంకర్ హైపర్ ఆది స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో అందరు టీడీపీ వర్సెస్ వైసీపీ గురించి మాట్లాడుతున్నారు కానీ.. ఎన్నికల ఫలితాల తర్వాత అందరు జనసేన గురించి మాట్లాడుకుంటారన్నారు. ఏపీలో జనసేన పార్టీది సైలెంట్ వేవ్ ఈ సందర్భంగా గుర్తు చేసారు. ఎన్ని సీట్లు వస్తాయన్నది ఖచ్చితంగా చెప్పలేకపోయినా.. జనసేన పార్టీ అండలేనిదే ఏ ప్రభుత్వం ఏర్పాటు కాదన్నారు. అవకాశమోస్తే ఏపీకీ కాబోయే సీఎం పవన్ కళ్యాణే అని కుండ బద్దలు కొట్టారు. ముఖ్యంగా కోస్తా జిల్లాలతో పాటు ఉత్తారాంధ్రలో జనసేనకు ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే జనసేన పార్టీ క్షేత్ర స్థాయిలో చేసిన సర్వేలో అనుకూల ఫలితాలే రాబోతున్నట్టు స్పష్టం అయిందన్నారు. మరి హైపర్ ఆది చెప్పినట్లే ఏపీలో ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో జనసేన కింగ్ అవుతుందా లేకపోతే కింగ్ మేకర్ అవుతుందా అనేది తేలాలంటే మే 23 వరకు వెయిట్ చేయాల్సిందే.