యువ సీఎంకు అభినందనలు
Spread the love

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై అన్నివర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అలుపెరగని పోరాటం చేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చిన జననేతపై అభినందనల వర్షం కురుస్తోంది. వైఎస్‌ జగన్‌ను అభినందిస్తూ పలువురు సినిమా ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా అభినందనలు తెలుపుతున్నారు.

‘ఘన విజయం సాధించిన కొత్త యువ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అభినందనలు’ అంటూ అక్కినేని నాగార్జున ట్వీట్‌ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నికైన యంగెస్ట్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అభినందనలు. మంచి పాలన అందిచాలని కోరుకుంటూ శుభాకాంక్షలు’ అంటూ హీరో రవితేజ ట్వీట్‌ చేశారు. ఘన విజయాన్ని అందుకున్న వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌కు గొప్ప భవిష్యత్‌ ఉంటుందన్న నమ్మకాన్ని హీరో నాని వ్యక్తం చేశారు.