రేవంత్ ఇళ్లపై ఐటీ మెరుపుదాడి..ఆయన ఇంటి వద్ద భారీగా అభిమానులు…
Spread the love

ప్రస్తుత కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ మాజీ నేత రేవంత్ రెడ్డి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ,ఈడీ అధికారులు దాడులకు దిగారు.హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న నివాసంతో పాటు కొడంగల్ నివాసంలోనూ అధికారులు సోదాలు జరుపుతున్నారు.అధికారులు దాడులకు వెళ్లగానే ఆయన కుటుంబ సభ్యుల౦దరి ఫోన్లనూ స్వాధీనం చేసుకుని స్విచ్చాఫ్ చేసినట్టు తెలుస్తోంది.ఈ రోజు ఉదయం నుంచి సోదాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

తమ నేత రేవంత్ రెడ్డి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ, ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న ఆయన అభిమానులు, పెద్దఎత్తున కొడంగల్ లోని ఇంటి వద్దకు చేరుకుంటుండటంతో ఉద్రిక్త వాతావరణ౦ చోటుచేసుకుంది.రేవంత్ ఇంట్లో లేని సమయంలో సోదాలేంటని ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అధికారులు ఈ సోదాలకు వచ్చారని అభిమానులు విమర్శిస్తున్నారు.రేవంత్ ఇంట్లో సోదాల విషయం తమకు ముందుగా తెలియద౦టున్న పోలీసులు,ఆయన ఇంటి వద్ద ముందుగానే బందోబస్తును ఏర్పాటు చేశారు.అంతేకాక రేవంత్ రెడ్డి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.