ఎన్నికల అధికారులు పవన్‌ కల్యాణ్‌కు
Spread the love

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై విజయవాడ ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ కల్యాణ్‌ ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించారని మండిపడ్డారు. క్యూలో నిలబడిన తమని తోసి మరి తన ఓటుహక్కును వినియోగించుకున్నారని, ఎన్నికల అధికారులు పవన్‌ కల్యాణ్‌కు ఏమైనా ప్రత్యేక అధికారాలు కల్పించారా? అంటూ నిలదీశారు. సీఎం అభ్యర్థిగా చెప్పుకునే పవన్‌.. కనీస నిబంధనలు పాటించరా? అంటూ ఫైర్‌ అయ్యారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి హైదరాబాద్‌ నుంచి వచ్చామని, ఉదయం అల్పహారం తీసుకోకుండా క్యూలైన్‌లో నిల్చున్నామన్నారు. కానీ పవన్‌ కల్యాణ్‌ మాత్రం వస్తూనే క్యూలో నిల్చున్న ఓటర్లను తోసుకుంటూ పోలింగ్‌ బూత్‌లకు వెళ్లిపోయారని, ఇది ఏమైనా భావ్యమా? అని న్యూస్‌ 18 చానెల్‌తో మాట్లాడుతూ ప్రశ్నించారు. ఇక విజయవాడ పటమటలో పవన్‌ కల్యాణ్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్న విషయం తెలిసిందే