ఓటేసిన పాపానికి శిక్షలు టీడీపీకి
Spread the love

తెలుగుదేశం పార్టీకి పొరపాటున ఓటేసిన పాపానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు లెక్కలేనన్ని శిక్షలు వేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు విమర్శించారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా స్థానిక స్టీమర్‌ రోడ్డులో బుధవారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ముదునూరి మాట్లాడుతూ సర్కారు విధానాలపై ధ్వజమెత్తారు. ఏదో మంచి చేస్తారని తప్పుడు హామీలను నమ్మి 2014లో ప్రజలు టీడీపీకి ఓటు వేశారని పేర్కొన్నారు. అయితే ఈ నాలుగేళ్ల పాలనలో రైతులు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, కార్మికులు అందరినీ చంద్రబాబునాయుడు రోడ్డు మీదకు ఈడ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

రానున్న ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గత నాలుగేళ్లలో టీడీపీ నియోజకవర్గంలో ఒక్క శాశ్వత అభివృద్ధి పనీ చేయలేదన్నారు. వశిష్ట వంతెన నిర్మాణంపై డ్రామాలు ఆడుతోందని, ఫిషింగ్‌ హార్బర్‌ విషయంలో మత్స్యకారులను మోసం చేస్తోందని ముదునూరి మండిపడ్డారు. సాగు, తాగునీటి కోసం రైతులు, ప్రజలు కటకటలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పుష్కరాల పేరిట చేసిన అభివృద్ధి పనులు ఎందుకూ పనికిరాకుండా పోయాయని విమర్శించారు.

మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు మత్స్యకారులను ఘోరంగా అవమానించారని, తాటతీస్తానంటూ హెచ్చరించారని విమర్శించారు. ఇచ్చిన హామీ మేరకు తమను ఎస్సీల్లో చేర్చాలని అడిగిన పాపానికి ముఖ్యమంత్రి హోదా మరిచి మత్స్యకారులతో దారుణంగా మాట్లాడారని మండిపడ్డారు. చంద్రబాబునాయుడు మాటలు మత్స్యకారుల గుండెల్లో గునపాల్లా గుచ్చుకున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో మత్స్యకారుల సత్తా చూపించి, చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రతిష్ట కుల రాజకీయాలతో రోజురోజుకూ దిగజారుతోందని పేర్కొన్నారు. పార్టీ నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ కన్వీనర్‌ వంక రవీంద్ర మాట్లాడుతూ దోచుకో, దాచుకో అన్న చందంగా చంద్రబాబునాయుడు పాలన సాగుతోందని విమర్శించారు

జగన్‌ తీరు పట్ల ఆయన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఎంతగానో బాధపడేవారు. ఎవరి మాటా వినని తత్వం జగన్‌ది. వైసీపీలో చేరాలని నాకు జగన్‌ రాయబారం పంపాడు. నీకు ఎన్ని సీట్లు కావాలన్నా ఇస్తామని విజయసాయిరెడ్డి నా వద్దకు వచ్చారు. కానీ జగన్‌ సంగతి తెలిసిన నేను దాన్ని తిరస్కరించాను. ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ భూస్థాపితం అయింది. చంద్రబాబుకు ఉన్నంత దూరదృష్టి మరెవరికీ లేదు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఆస్తి. దాని వారసుడు కచ్చితంగా లోకేశే. చంద్రబాబు తర్వాత లోకేశ్‌ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి? అని అన్నారు.

తనతో పెట్టుకుంటే జగన్‌ చరిత్ర మొత్తం బయటపెడతానంటూ.. 40 ఏళ్ల చరిత్రను జేసీ చెప్పుకొచ్చారు. జగన్‌లో రాజారెడ్డి క్రూరత్వం ఉందని ఆయన అన్నారు. స్కెచ్‌ వైఎస్‌ వేసేవారని, రాజారెడ్ది అమలు చేసేవారని జేసీ తెలిపారు. వైఎస్‌ను మంత్రిని చేసేందుకు రాజారెడ్డి చేయని పనులు లేవని ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో జగన్‌ దగ్గర రూ. వెయ్యి కోట్ల హార్డ్‌ క్యాష్‌ ఉందని జేసీ పేర్కొన్నారు.