బయోపిక్ ల  రిలీజ్ తేదీల  మద్య తీవ్ర పోటీ !!
Spread the love

ఎన్టీఆర్ జీవితకథను రెండు భాగాలుగా క్రిష్ తెరకెక్కిస్తున్న సంగతి మన అందరకి తెలిసిందే.అయితే ఎన్టీఆర్ – కథానాయకుడు ఎన్టీఆర్ – మహానాయకుడు ఆన్ సెట్స్ మీదే ఉన్నాయి. ఇక జనవరి 9న సంక్రాంతి కానుకగా కథానాయకుడు చిత్రం రిలీజవుతోంది. అలాగే జనవరి 25న రిపబ్లిక్ డే కానుకగా మహానాయకుడు చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. `మహానాయకుడు` చిత్రంతో వైయస్సార్ బయోపిక్ `యాత్ర` పోటీపడనుందని తెలుస్తోంది. ఇన్నాళ్లు ఈ సినిమా డిసెంబర్ లేదా సంక్రాంతి బరిలో రిలీజవుతుందని ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు తేదీ మారిందన్న మాటా వినిపిస్తోంది. మహానాయకుడు రిలీజ్ తేదీకే పోటాపోటీగా `యాత్ర`ను రిలీజ్ చేయాలని దర్శకుడు మహి.వి.రాఘవ్ అండ్ టీమ్ భావిస్తున్నారని సమాచారం.

ఇక అయితే ఇక్కడ ఓ కన్ఫ్యూజన్ ఉంది మాత్రం ఉంది అది ఏమిటంటే : ఎన్టీఆర్ – మహానాయకుడు చిత్రాన్ని రిపబ్లిక్ డేకి రిలీజ్ చేయడం కుదరదని – ఆ క్రమంలోనే ఫిబ్రవరి 14న రిలీజ్ చేయనున్నారని ఇదివరకూ ప్రచారమైందని తెలిసిందే. తక్కువ వ్యవధిలో రెండు సినిమాల్ని రిలీజ్ చేయడం సరికాదని పంపిణీదారులు సూచించారన్న మాటా వినిపించింది. దీన్ని బట్టి `యాత్ర` సినిమాని ఏ తేదీకి రిలీజ్ చేస్తారు? మహానాయకుడు మొదటి తేదీ జనవరి 25న యాత్ర వస్తుందా? లేక ఫిబ్రవరి 14కు వెళుతుందా? అన్నది తెలియాల్సి ఉంది. రాజకీయాల్లోకి వచ్చి ఎన్టీఆర్ సీఎం అయినప్పటి నుంచి అతడి లైఫ్ ఎండ్ వరకూ మహానాయకుడు చిత్రంలో చూపిస్తున్నారు. అలానే వైయస్సార్ పాద యాత్ర సహా ఆయన జీవితంలో ఎన్నో కీలక ఘట్టాల్ని యాత్ర చిత్రంలో ఆవిష్కరిస్తున్నారు. ఈ రెండు సినిమాల మధ్య పోటీ ప్రస్తుతం ఫ్యాన్స్ లో వేడి పెంచుతోంది. ఎన్నికల వేళ ఇలా పోటాపోటీగా బయోపిక్ లను ఒకేరోజు రిలీజ్ చేయాలన్న నిర్ణయం యాధృచ్ఛికమేనా? లేక ఉద్ధేశపూర్వకమైనదా? అన్న చర్చ సాగుతోంది. మహానాయకుడిగా బాలకృష్ణ – వైయస్సార్ గా మమ్ముట్టి నటిస్తున్న సంగతి మన అందరకి తెలిసిందే.