పట్టపగలే యువతి దారుణ హత్య బ్లేడ్‌తో గొంతుకోసి
Spread the love

దుకాణంలో ఒంటరిగా ఉన్న ఓ యువతిని బ్లేడ్‌తో గొంతుకోసి ఆపై చున్నీతో మెడకు బిగించి దారుణంగా హత్య చేశాడు. ఇది ప్రేమోన్మాది ఘాతుకమని పోలీసులు అనుమానిస్తున్నారు. జుబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. అన్నపూర్ణ దంపతులు తొమ్మిదేండ్ల క్రితం బతుకుదెరువుకోసం నగరానికి వచ్చారు, వీరికి దుర్గ(21), వెంకటలక్ష్మి(19), బాబు (17) సంతానం. అగ్గిరాముడు బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఎమ్మెల్యే కాలనీలో ఆరేండ్ల పాటు వాచ్‌మెన్‌గా పనిచేశాడు.

ఈ విషయాన్ని వెంకటలక్ష్మి జ్యోత్స్నకు ఫోన్ చేసి చెప్పింది. గమనించిన యువకుడు అక్కడినుంచి వెళ్లిపోయాడు. మళ్లీ మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి వచ్చాడు. ఇద్దరు యువకులు దుకాణం బయట ఉండగా.. సదరు యువకుడు లోపలికి వెళ్లి కౌంటర్‌లో స్టూల్‌పై కూర్చున్న వెంకటలక్ష్మితో వాగ్వాదానికి దిగాడు. ఇంతలో పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో ఆమె గొంతుకోశాడు. దాంతో వెంకటలక్ష్మి కుప్పకూలిపోయింది, ఆమె చనిపోలేదని తెలుసుకున్న యువకుడు.. ఆమె మెడకు చున్నీని గట్టిగా బిగించాడు. ఆమె చనిపోయినట్లు నిర్దారించుకున్న తర్వాత, మృతదేహాన్ని లోపలికి ఈడ్చుకు వెళ్లి ఓ మూలన పడేశాడు. ఆ తరువాత షట్టర్‌ను కిందకు గుంజి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

మృతి చెందిందని నిర్ధారించుకున్న తర్వాతే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ హత్యలో అతనికి మరో ఇద్దరు సహకరించారు. రెండు గంటల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జన సంచారం ఉన్న రోడ్డుకు పక్కన పట్టపగలే ఓ షాపులో హత్య చోటుచేసుకోవడం యూసుఫ్‌గూడలోని జవహర్‌నగర్‌లో కలకలం సృష్టించింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నారు. మూడేళ్లుగా జవహర్‌నగర్‌లో నివాసముంటున్నారు. వీరి పెద్ద కుమార్తె వెంకటలక్ష్మి(18) రెండు నెలల క్రితం జవహర్‌నగర్‌ ప్రధాన రోడ్డులో ఉన్న జోడీ ష్యాషన్‌ జువెలరీలో షాపులో పనిచేస్తోంది. కాగా, సోమవారం ఉదయం షాపు యజమానులు దినేశ్‌, జ్యోత్స్న ఖమ్మం వెళ్లారు. షాపు నిర్వహణ బాధ్యతను వెంకటలక్ష్మికి అప్పగించారు. ఆమె ఒంటరిగా ఉన్న విషయం తెలుసుకున్న మధురానగర్‌కు చెందిన సాగర్‌ మధ్యాహ్నం 1.50 గంటలకు షాపులోకి వచ్చాడు , ప్రేమిస్తున్నానంటూ వేధించాడు.

ఆరు నెలలుగా సాగర్‌ అనే యువకుడు తనను వేధిస్తున్నట్లు వెంకటలక్ష్మి తన కుటుంబ సభ్యులకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. గతంలోనూ ఓసారి సాగర్‌ ఇలానే చేసినట్లు ఆమె పలువురి వద్ద వాపోయినట్లు తెలిసింది. ప్రేమను నిరాకరించిన కారణంగానే అతడు ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగానే కుట్ర పన్ని సాగర్‌ గత నాలుగైదు రోజులుగా ఆమెను వెంటాడుతూ, ప్రతి కదలికను గుర్తించినట్లు తెలిసింది.

జూబ్లీహిల్స్‌ పోలీసులు నిందితుడు సాగర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. సాగర్‌ను హోంగార్డుగా గుర్తించారు. గతంలో ట్రాఫిక్‌ విభాగంలో డీసీపీ పనిచేసిన అధికారి వద్ద డ్రైవర్‌గా పనిచేశాడు.. హత్య చేసిన అనంతరం సాగర్‌ విశ్రాంత ఐఏఎస్‌ అధికారి వద్దకు వెళ్లి జరిగింది చెప్పాడు. ఇంతలో పోలీసులు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ద్వారా సాగర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.