మహారాష్ట్ర లో దారుణం భర్త కళ్ళ ముందే భార్య పైన గ్యాంగ్ రేప్
Spread the love

మహారాష్ట్ర లో ఘోరం జరిగింది . కట్టుకున్న భర్త  కళ్ళ ముందే  భార్యపై గ్యాంగ్ రేప్ చేసారు . భర్త కాళ్లూ చేతులు  కట్టి కారులో పడేసి.. ఆ తర్వాత అతని ముందే 20 యేళ్ళ భార్యపై ఆ కామాంధులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు . బాధితురాలు 8 నెలల గర్భిణి అయినప్పటికీ నిందితులు కరుణ చూపలేదు  . మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఈ దారుణం  జరిగింది.

పోలీసులు  చెప్పిన  దాని ప్రకారం సతారా జిల్లాలో ఈ దంపతులు  ఓ హోటల్‌ను నడుపుతున్నారు  ఈ హోటల్‌లో పనిచేసేందుకు ఇధ్దరు అవసరమయ్యారు. ఇంతలో ముకుంద్ మానే అనే నిందితుడు వీరి కి ఫోన్ చేసి . ఇక్తుర్చిఫాటా ప్రాంతంలో ఓ జంట పనిచేసేందుకు సిద్ధంగా ఉందనీ, రూ.20 వేలు అడ్వాన్స్ తీసుకుని రావాలని వారికీ చెప్పాడు

దీంతో భార్యతో కలసి హోటల్ యజమాని తుర్చిఫాటాకు వెళ్లాడు. అక్కడే మరో 8 మంది నిందితులతో కలసి ముకుంద్ అతడి పైన కర్రలతో  రాడ్లతో దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. ఆ తర్వాత అతడిని కాళ్లూ చేతులు కట్టేసి కారులో పడేశారు. పిమ్మట ఆయన భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వీరివద్ద ఉన్న నగదు, బంగారం దోచుకుని పరారయ్యారు. అక్కడ నుంచి తప్పించుకుని వచ్చి దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.