ప్రియుడి మోజులో భర్త ను చంపేందుకు భార్య ప్లాన్
Spread the love

ప్రియుడి కోసం మొగుడిని  హత్య చేయాలనుకున్న ఓ నవవధువు అడ్డంగా బుక్ అయ్యింది . తన   ప్రియుడితో వెళ్ళిపోవాలని  ఓ నవవధువు.. అతనితో కలిసి భర్తను హతమార్చేందుకు పక్కా ప్లాన్ వేసింది. అయితే ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యింది కా. చివరికి పోలీసులకు ఆ నవ వధువు దొరికిపోయింది. చెన్నై శివార్లలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కదిరవన్ (30)కు నెల రోజుల క్రితం తూత్తుకుడికి చెందిన అనిత (25)తో  పెళ్లి జరిగింది . ఆపై గత వారాంతంలో వారు సముద్ర తీరానికి షికారు కి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరి బైకును అడ్డుకున్న ఇద్దరు కదిరవన్‌పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అనిత ధరించిన 12 సవర్ల నగలు, రూ.1000 తీసుకుని పరారయ్యారు. తీవ్రగాయాలకు గురైన కదిరవన్ ఆస్పత్రిలో చేరాడు. తర్వాత అతని భార్య అనిత స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించారు. కదిరవన్ పై దాడి జరుగుతున్న సమయంలో అనిత ఏ మాత్రం కూడా  అతని భార్య స్పందించలేదు అయితే అనుమానం వచ్చిన  పోలీసులు  . ఆమ వద్ద జరిపిన విచారణలో అసలు నిజయం బయటపడింది.

కాలేజీ రోజుల్లో తాను జగన్ ప్రేమలో పడ్డానని.. పెద్దలు కదిరవన్‌తో పెళ్లి చేయించారని తెలిపింది. పెళ్లిని వదిలించుకునేందుకే కదిరవన్‌పై దాడి చేయించానని..అంగీకరించింది. దీంతో జగన్, అనితలను పోలీసులు అరెస్ట్ చేసి.. జైలు తరలించారు.