యువ ఆటగాడు పృథ్వీషాను ఎవరితోనూ పోల్చొద్దని
Spread the love

టీమిండియా యువ సంచలనం పృథ్వీ షాను ఒంటరిగా వదిలేయాలని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి విజ్ఞప్తి చేసాడు. ఇతర క్రికెటర్లతో పోల్చుతూ అతనిపై ఒత్తిడి నెలకోనేలా చేయవద్దని సీనియర్‌ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ చేసిన వ్యాఖ్యలను కోహ్లి సమర్ధించాడు. హైదరాబాద్‌ వేదికగా శుక్రవారం నాడు నుంచి రెండో టెస్ట్‌ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. రాబోయే ఆస్ట్రేలియా పర్యటనకు ముందు జట్టులోని లోటుపాట్లను, టెస్ట్‌లకు రిజర్వ్‌ బెంచ్‌ను పరీక్షించాలని యాజమాన్యం భావిస్తోంది. ఇటీవలి ఆసియా కప్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రెస్ట్‌ తీసుకొని పలువురు రిజర్వ్‌ ఆటగాళ్లను పరీక్షించిన సంగతి తెలిసిందే అదే రీతిలో రెండో టెస్ట్‌కు కెప్టెన్‌ కోహ్లీ విశ్రాంతి తీసుకొని.. అజింక్యా రహానెకు సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. అలాగే దేశవాళీల్లో పరుగుల వరద పారిస్తున్న కర్ణాటక బ్యాట్స్‌మన్‌ మయాంక్‌ అగర్వాల్‌, హైదరాబాద్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ టెస్ట్‌ అరంగేట్రం చేసే చాన్సుంది.

ఏదో ఇప్పుడే సాధించేయాలన్న తొందరపాటు పృథ్వీషాకు అవసరం లేదు. ఒక యువ ఆటగాడు ఎదిగేందుకు, సామర్థ్యం పెంచుకొనేందుకు తగిన సమయం ఇవ్వాలి. షా బాల క్రికెట్‌ మేధావి. అందరూ చూస్తున్నట్టుగానే అతడిలో చాలా ప్రతిభ ఉన్నాది. అతడిని అత్యున్నత స్థాయిల్లో ఆడించాలని కోరుకుంటున్నాం. మొదటి మ్యాచ్‌లో ఏం సాధించాడో మళ్లీ మళ్లీ దాన్నే పునరావృతం చేయగలడని నమ్ముతున్నాం. అతడు త్వరగా నేర్చుకుంటాడు. తెలివైనవాడు. పరిస్థితులను చక్కగా అర్థం చేసుకోగలడు. షాను చూసి సంతోషిస్తున్నాం. అతడిని ఇప్పుడే ఎవరితోనూ పోల్చకూడదు. ఆ యువ ఆటగాడిని ఒత్తిడికి గురయ్యే పరిస్థితుల్లోకి నెట్టొద్దు. ఆటను ఆస్వాదించే యువకుడిగానే ఉండనిద్దాం. అతడికి కావాల్సిన సమయం ఇద్దాం’ అని కోహ్లీ అన్నాడు.

ఉప్పల్‌లో అజేయ భారత్‌

ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌ అపజయమే ఎరుగకుండా సాగుతోంది. న్యూజిలాండ్‌తో మొదటి మ్యాచ్‌ డ్రాగా ముగియగా..తర్వాతి మూడు టెస్ట్‌ల్లో టీమిండియా ఘన విజయాలు నమోదు చేసింది. 2014లో వెస్టిండీస్‌ భారత్‌లో పర్యటించినప్పుడు మూడు టెస్ట్‌ల సిరీస్ లో మొదటి మ్యాచ్‌ ఉప్పల్‌లో జరగాల్సి ఉన్నాది. కాబట్టి హుద్‌హుద్‌ తుఫాన్‌తో టెస్ట్‌ సిరీస్‌ మొత్తం రద్దయింది.