విద్యుత్ కాంతుల మధ్య ఇంద్రకీలాద్రి… సోషల్ మీడియాలో హాల్ చల్ !
Spread the love

శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ నగరం సుందరంగా ముస్తాబు అయ్యింది.ఇందులో భాగంగా డ్రోన్ కెమెరాతో తీసిన ఒక ఫొటో సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.ఈ ఫోటో విద్యుత్ కాంతుల మధ్య ధగధగలాడిపోతుంది.ఈ చిత్రం లో ఇంద్రకీలాద్రి, కాళేశ్వరరావు మార్కెట్, ప్రకాశం బ్యారేజ్, కృష్ణా నది, సీతానగరం ప్రాంతాలని బంధించారు.

దసరా నవరాత్రుల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోపై నెటిజన్లు తమ బెజవాడ అందమైన నగరమ౦టూ…కామెంట్లు పెడుతున్నారు.ఈ ఫోటోను  రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖ టూరిజం ప్రమోషన్ లో భాగంగా తీయించారు.