నందమూరి హరికృష్ణ కు ఉపరాష్ట్రపతి నివాళి…
Spread the love

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత,సినీ నటుడు నందమూరి హరికృష్ణ దుర్మరణం చాలా విచారకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.ఈరోజు ఉదయం మెహదీపట్నం లోని ఆయన నివాసంలో నందమూరి హరికృష్ణ పార్థివదేహానికి వెంకయ్యనాయుడు నివాళులు అర్పించారు.అక్కడే ఉన్న నందమూరి కుటుంబసభ్యులను ఆయన పరామర్శించి సంతాపాన్ని తెలియజేసారు.

ఆ తరువాత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ…”హరికృష్ణ నిర్భీతిగా, నిక్కచ్చిగా, ముక్కుసూటిగా వ్యవహరించేవారు ఏ పనైనా చిత్తుశుద్ధితో చేసే మనస్తత్వం గతంలో కూడా రాజ్యసభలో తెలుగులోనే మాట్లాడుతానని గట్టిగా చెప్పారని..ఆనాటి ఛైర్మన్‌ అందుకు అభ్యంతరం తెలిపితే తాను జోక్యం చేసుకుని తర్జుమా చేస్తానని చెప్పినట్లు వెంకయ్యనాయుడు తెలిపారు.హరికృష్ణ సినీ, రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్న ఆయనకు చాలా మంది అభిమానులు ఉన్నారని కొనియాడారు.ఆయన పవిత్రాత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు వెంకయ్య నాయుడు…తెలియజేసారు.ఆయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి.