మన దేశం లో   టాప్ 10 అపరకుబేరులు    వీళ్ళే ..
Spread the love

భారత్ దేశానికి ప్రధానిగా ఉన్నా పీవీ నరసింహారావు .. ఆర్థిక మంత్రి మన్మోహన్ సారథ్యంలో దేశంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని భారతదేశం ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతోంది. 1990 తర్వాతి నుంచే దేశంలో వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించాయి. ఫార్మా – ఐటీ – ఎలక్ట్రానిక్ రంగాలకు బీజం పడింది.

ఇక దేశంలో చిన్నగా వ్యాపారాలు ప్రారంభించి ఇప్పుడు దేశంలోనే కుబేరులుగా మారిన వారు ఎంతో మంది ఉన్నారు. వారిలో ముఖ్యులు ధీరుబాయ్ అంబానీ.. రిలయన్స్ గ్రూపు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందంటే ఆయనే కారణం. ఆయన తనయులు ఇద్దరు ఇప్పుడు రిలయన్స్ బ్రాండ్ కు వన్నె తెచ్చారు. ముఖేష్ అంబానీ అయితే వినూత్న వ్యాపార ఐడియాలతో దేశంలోనే నంబర్ 1 ధనికుడిగా ఎదిగారు. దేశవ్యాప్తంగా టాప్ 10 ధనవంతుల జాబితాను ఒక్కసారి పరిశీలిస్తే..

1. ముఖేష్ అంబానీ

దేశంలోనే అత్యంత సంపన్నమైన వ్యక్తి ముఖేష్ అంబానీ.. ఈ భారతీయు కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీగా కొనసాగుతున్నారు. 57ఏళ్ల ఈయన సంపద విలువ అక్షరాల 38 బిలియన్ డాలర్లు. ధీరుభాయ్ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోతున్న కొడుకుగా ఈయన దేశంలో గుర్తింపు పొందాడు.

2. అజీమ్ ప్రేమ్ జీ..

దేశంలో రెండో ధనవంతుడు విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ. 69 ఏళ్ల పెద్దాయన ఆస్తుల విలువ 19.1 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈయన కాస్మోటిక్ – సౌందర్య సాధనాల కంపెనీలు – ఎలక్ట్రానిక్ – మ్యానిఫ్యాక్షరింగ్ కంపెనీలకు చైర్మన్ గా ఉన్నారు.

3. శివ్ నాడర్

కంప్యూటర్ ఉపకరణాలు – సాఫ్ట్ వేర్ రంగంలో అగ్రగామి సంస్థ అయిన హెసీఎల్ టెక్నాలజీస్ చైర్మన్ శివ్ నాడర్. దేశంలోనే సంపద కలిగిన వారిలో 4వ వ్యక్తి. ఈయన వయసు 69 ఏళ్లు. ఈయన సంపద విలువ 14.8 బిలియన్ డాలర్లు.

4.లక్ష్మీ మిట్టల్

బ్రిటన్ లో నివసించే భారతీయ కుబేరుడు లక్ష్మీ మిట్టల్ ఇనుము – స్టీల్ వ్యాపారంలో అగ్రగణ్యుడు. ఈయన ఆర్సెలర్ చైర్మన్ గా ఉన్నారు. ఈయన వయసు 64ఏళ్లు. సంపద విలువ 13.5 బిలియన్ డాలర్లు.

5. దిలీప్ సింఘ్వీ

సన్ ఫార్మా చైర్మన్ గా ఉన్న దిలీప్ సంఘ్వీ భారత దేశంలోనే సుపరిచిత వ్యాపారవేత్త. ఈయన వయసు 59 ఏళ్లు. సంపద విలువ 11.1 బిలియన్ డాలర్లు. ఈయన దేశంలో ఐదో పెద్ద ధనవంతుడు.

6. కుమార మంగళం బిర్లా

బిర్లా గ్రూప్ చైర్మన్ – ఐడియా సెల్యూలర్ కంపెనీ చైర్మన్ అయిన ఆదిత్యా బిర్లా దేశంలోనే వివిధ రంగాల్లో ఉన్నారు. టెలికాం – రిటైల్ – సిమెంట్ – ఐటీ – ఎలక్ట్రానిక్స్ రంగంలో పేరొందారు. ఈయన వయసు 47 ఏళ్లు.. సంపద విలువ 9 బిలియన్ డాలర్లు

7.ఉదయ్ కొటక్

ప్రైవేటు రంగంలోని కొటక్ మహేంద్ర బ్యాంక్ దేశంలోనే పేరెన్నికగల బ్యాంక్. దీనికి చైర్మన్ గా ఉన్నారు ఉదయ్ కొటక్.. ఈయన వయసు 55 ఏళ్లు.. సంపద విలువ 7.2 బిలియన్ డాలర్లు.

8. గౌతమ్ అదానీ

గుజరాతీ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ దేశ ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితులు. ఈయన అదానీ గ్రూప్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. పెట్రో – గ్యాస్ – సహజవాయువులు – బొగ్గు రంగాల్లో ఈయన పరిశ్రమలున్నాయి. వయసు 52 ఏళ్లు కాగా సంపద విలువ 6.6 బిలియన్ డాలర్లు..

9. సునీల్ మిట్టల్

దేశంలోనే నంబర్ 1 టెలికాం సంస్థ ఎయిర్ టెల్ ఓనర్ సునీల్ మిట్టల్.. దీని మాతృసంస్థ భారతీ ఎంటర్ ప్రైజెస్ కు చైర్మన్ ఈయన 57 ఏళ్ల ఈయన సంపద విలువ 6.6 బిలియన్ డాలర్లు

10.సైరస్ పూనావాలా

సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వ్యవస్థాపకులు సైరస్ పూనావాలా. ఫుణె కేంద్రంగా ఈయన దేశవ్యాప్తంగా పరిశ్రమలు స్థాపించారు. 73 ఏళ్ల పెద్దాయన అయిన ఈయన సంపద విలువ 6.6 బిలియన్ డాలర్లు

ఇలా దేశంలోని టాప్ 10 ధనవంతులు అంతా 50 ఏళ్లు పైబడిన వారే కావడం విశేషం. ఇందులో ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ మాత్రమే 47 ఏళ్లు ఉన్న వ్యక్తి. మిగతా అంతా స్వాతంత్ర్య కాలం నుంచి కష్టపడి ఈ స్థాయికి ఎదిగిన వారే..