టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ సిరిసిల్ల పర్యటన
Spread the love

నేడు మంత్రి కెటిఆర్‌ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మంత్రి కెటిఆర్‌ చందుర్తి, కోనరావుపేట, తంగళ్లపల్లి మండలాల్లో రైతుబంధు చెక్కుల పంపినీలో పాల్గొని రైతులకు చెక్కులను అందజేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు ఎల్లారెడ్డి పేట మండలం,1.30కు గంటలకు గంభీరావు పేట మండలం, 2.30కు ముస్తాబాద్, 3.30కు సిరిసిల్ల మండలం, 4.30 గంటలకు సిరిసిల్ల టౌన్ నాయకులతో కెటిఆర్ సమావేశం కానున్నారు. నియోజకవర్గ నాయకులతో సమావేశాలు నిర్వహించి అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించనున్నట్లు సమాచారం.