‘ఫెరారీ’  బుక్‌ రేటు.. జస్ట్‌ రూ.20 లక్షలేనట?
Spread the love

చరిత్ర ఎంత ఖరీదయినదో తెలియాలంటే.. ముందు ఫెరారీ గురించి తెలుసుకోవాలి . ఫెరారీ.. ఇటలీకి చెందిన లగ్జరీ కార్ల కంపెనీ .. రేట్లు అదిరిపోతాయ్‌.. మనం కొనలేం.. అయితే.. కారే కాదు.. ఆ కారు గురించి రాసిన పుస్తకాన్ని కూడా మనం కొనలేం. ఎందుకంటే.. ఈ మధ్య కాలంలో ఆ కార్ల చరిత్ర గురించి తెలుపుతూ ఓ పుస్తకాన్ని తయారు చేసారు . దాని విలువెంతో తెలుసా? కేవలం .. రూ.20 లక్షలే.. 514 పేజీలు ఉండే ఆ పుస్తకాన్ని ఉంచిన స్టాండ్‌.. చూడటానికి ఫెరారీ 12 సిలెండర్ల ఇంజిన్‌లా కనిపిస్తుంది . స్టీల్‌పై క్రోమియం పూత వేసి తయారుచేశారు. అల్యూమినియం పెట్టెలో ఉంచారు. ఇందులో ఫెరారీకి సంబంధించిన అరుదైన చిత్రాలు ఉన్నాయట. ఈ బుక్‌ స్టాండ్‌ను డిజైనర్‌ మార్క్‌ న్యూసన్‌ తయారు చేసారు.

మొత్తం 1,947 పుస్తకాలను ముద్రణ చేయించారు . అందులో 250 పుస్తకాలను ఒక్కోక్కటి 20 లక్షల రూపాయల చొప్పున అమ్ముతారు . అదీ కూడా డబ్బున్న ప్రతి ఒక్కళ్లకూ అమ్మరు . మ్యూజియంలకు, ఫెరారీ కార్లను ఎక్కువగా కొనే వాళ్లకి మాత్రమే అమ్ముతారు. మరి మిగిలిన 1,697 పుస్తకాలను ఏం చేస్తారనే కదా మీ ప్రశ్న.. వీటిని అమ్మడానికి అటువంటి షరతులేవీ లేవు. ఎవరికైనా అమ్మేస్తారు . వాటి ధర 4.1 లక్షల రూపాయలు .. అయితే.. ఆ డిజైనర్‌ స్టాండ్‌లాంటి అదనపు హంగులు ఉండవట. ఇంతకీ ఈ పుస్తకం పేరు చెప్పలేదు కదూ.. వేరేది పెడితే బాగుండదని ఆలోచించి .. ‘ఫెరారీ’అనే పెట్టేశారు.