అనుష్క శర్మని ఎలా పడితే అలా..  ట్రోలింగ్ చెస్తున్నారు  బాబోయ్!
Spread the love

ఈ మధ్య కాల౦ లో   సోషల్ మీడియా పుణ్యామాని   సెలబ్రిటీలకు ఎంత పాపులారిటీ వస్తుందో ప్రత్యేకంగా చెప్పనవరసరం లేదు.అయితే  తమ సోషల్ మీడియా అకౌంట్ లో ఒక పోస్ట్ పెట్టి కోట్లు కొల్లగొట్టే సెలబ్రిటీలు – సినీ తారలు కూడా  ఉన్నారని మన౦ ప్రత్యేక౦ గా చెప్పవల్సిన పనిలేదు. అయితే అదే సమయంలో బడా  సెలబ్రిటీలు – సినీతారలు…ఏదైనా విషయంలో దొరికితే….నెటిజన్ల ట్రోలింగ్ కూడా అంతకు మించి ఉంటుందని పలుసార్లు ప్రూవ్ అయింది కూడా.అది మరి  కాకతాళీయమో.ఏమో గాని …బాలీవుడ్ నటి అనుష్క శర్మపై గత  కొద్ది రోజులుగా నెటిజన్లు ను౦చి  విమర్శలు గుప్పిస్తున్నారు. కొద్ది రోజల క్రితం….రోడ్డుపై చెత్త వేసిన వ్యక్తిపై అనుష్క నోరు పారేసుకున్న ఘటన సోషల్ మీడియా లో  వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత లార్డ్స్ టెస్టుకు ముందు విరాట్ పక్కన రహానే స్థానంలో అనుష్క ఫొటో దిగడంపై కూడా నెటిజన్లు విమర్శలు గుప్పించారు. అయితే ఈ సారి అనుష్క తన సహజ సిద్ధమైన నటనపై ట్రోలింగ్ ఎదుర్కుంది. అనుష్క తాజా చిత్రం `సూయీ ధాగా` లో ఎమోషనల్ సీన్ లో నటించిన అనుష్కపై నెటిజన్లు విమర్శలు చెస్తున్నారు.

అనుష్క శర్మ  ఇప్పటికే పలు బాలీవుడ్ చిత్రాల్లో విలక్షణ పాత్రల్లో నటించి మెప్పించిందని మనకు తేలిసి౦దే. తాజాగా – అనుష్క – వరుణ ధావన్ నటించిన `సూయీ ధాగా`చిత్ర ట్రైలర్ విడుదలైంది. అందులో అనుష్క ఓ మధ్య తరగతి గృహిణిగా డీగ్లామర్ రోల్ లో నటిస్తోంది. అయితే ఆ ట్రైలర్ లోని కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో అనుష్క చాలా సహజంగా నటించిందని చెప్పాలి. ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన ఆకట్టుకుంది. అయితే నెటిజన్లు మాత్రం ఆ ఎమోషనల్ అనుష్క ఫొటోలపై ట్రోలింగ్ మొదలెట్టారు.

5 సార్లు ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత ఇంటర్ మీడియట్ పాసైతే తల్లి కళ్ళలో కనిపించే ఆనందం ఇదే అంటూ అనుష్క హావభావాలపై సెటైర్లు వేస్తున్నారు. వీకెండ్ లో ఆఫీస్ కు వెళుతుంటే కలిగే ఫీలింగ్ ఇదే అని మరికొందరు…విరాట్ కోహ్లీ తీసుకున్న డిఆర్ ఎస్ నిర్ణయం సరైనది అని తెలిసినపుడు కలిగే ఫీలింగ్ ఇలాగే ఉంటుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా…ఈ మధ్య అనుష్కపై నెటిజన్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు. సహజ సిద్ధంగా నటించినా….ట్రోల్  చెస్తున్నారు…