ఒక్కప్పుడు స్టార్ యాంకర్ ఇప్పుడు మద్యానికి  బానిసై అదోగతి !!
Spread the love

అతి చేస్తే అది ఎంతటి ఇబ్బంది కి దారి తీస్తుందో అర్థం కావడానికి ఈ యాంకర్ ఒక అసలైన ఉదాహరణ.. బాలీవుడ్ పాపులర్ యాంకర్ కపిల్ శర్మ ఎంతో ఫేమస్ అయ్యి తన వివాదాస్పద మాటలతో అంతే వేగంగా పతనమయ్యాడు.. తన కామెడీతో బాలీవుడ్ బుల్లితెరపై చెరగనటువంటి ముద్ర వేసిన ఈ యాంకర్.. దాని తర్వాత తన షోకు వచ్చిన అతిధులను అవమాన పరిచేలా కుల్లు జోకులు వేసి అభాసుపాలయ్యాడు. ఇతడి అసందర్భ కామెడీ – ఓవర్ యాక్షన్తో తో సదురు చానెళ్లపై తీవ్ర విమర్శలు వచ్చి పడ్డాయి . అందువల్ల కపిల్ ని చానెల్స్ తొలగించాయి . ఇప్పుడు చేయడానికి షోలు లేక.. మళ్లీ ఛాన్స్ వారు లేక డిప్రెషన్ లోకి వెళ్లినట్టు అర్థమవుతుంది .

ఈ సంవత్సరం సోనీ టీవీ ఛానల్ లో ప్రారంభం ఐన ‘ఫ్యామిలీ టైమ్ విత్ కపిల్ శర్మ’ అనే షోలో కపిల్ శర్మ చేసిన వివాదాస్పద మాటలు తీవ్ర దుమారం రేపాయి. లతా మంగేష్కర్ – ఆశా భోంస్లే – అమితాబ్ బచ్చన్ ల గొంతు ను కూడా మిమిక్రీ చేసి ఇతడు అవమాన పరిచాడు . అది అయిపోయాక మరోసారి ఈ షోకు అతిధిగా వచ్చిన సోనాక్షి సిన్హా ముందే ఆమె తండ్రి శత్రజ్ఞ సిన్హాను కూడా అనుకురించి మాటలు వాగాడు . దీనిపై డైరెక్ట్ గానే సోనాక్షి కపిల్ కి వార్నింగ్ ఇచ్చింది. అంతటితో సోనీ టీవీ ఆ షోను మధ్యలోనే ఆపివేసి కపిల్ ను యాంకరింగ్ నుంచి తొలగించింది .ఇలా వివాదాస్పద మాటలతో జరుగుతున్న ఆ షోను సోనీ టీవీ ఆపివేసింది. దీని తర్వాత కపిల్ కి ఎవ్వరూ చాన్స్ ఇవ్వకపోవడం వల్ల ప్రస్తుతం మద్యానికి బానిస అయ్యి .. డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడట.. ప్రస్తుతం కపిల్ శర్మ అమెరికాలో ఉంటున్నాడని సమాచారం.