సమంత: ఆ బుడ్డోడిని కిడ్నాప్‌ చేస్తా
Spread the love

‘రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు..’ఈ పాట ఎంత పాపులర్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘రంగస్థలం’ సినిమాలో ఈ పాటకు సమంత, రామ్‌చరణ్‌ డ్యాన్స్‌ హైలైట్‌గా నిలిచింది. ఈ పాటకు పేరడీలు చేసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. వీటిలో తనకు ఎంతో నచ్చిన కొన్ని వీడియోలకు సమంత రిప్లై కూడా ఇచ్చారు.

తాజాగా ఓ చిన్నారి ‘రంగమ్మ’ పాటకు డ్యాన్స్‌ చేసిన వీడియోను ఓ నెటిజన్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘ఈ వీడియోను ఒక్కసారి చూసి ఊరుకోలేరు, మళ్లీ చూడాలని అనిపిస్తోంది’ అంటూ సమంత, అనసూయ, సుకుమార్‌ను ట్యాగ్‌ చేశారు. బుడ్డోడి డ్యాన్స్‌కు సమంత ఫిదా అయ్యారు. ఈ క్యూటీని నేను కిడ్నాప్‌ చేస్తా’ అంటూ లవ్‌ సింబల్స్‌ను ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ చిన్నారి వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. నెటిజన్లు బుజ్జిగాడి డ్యాన్స్‌కు ఫ్యాన్స్‌ అయిపోయారు.

సమంత ప్రస్తుతం ‘యూటర్న్‌’ రీమేక్‌లో నటిస్తున్నారు. దీంతోపాటు ‘సూపర్‌ డీలక్స్‌’, ‘సీమ రాజా’ అనే తమిళ చిత్రాల్లోనూ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. తెలుగులో నాగచైతన్య, సమంత జంటగా ఓ సినిమా తెరకెక్కనుంది.

సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది సమంత నటించిన రంగస్థలం, మహానటి, అభిమన్యుడు చిత్రాలు మంచి విజయం సాధించాయి. ప్రస్తుతం తమిళంలో సీమరాజా, సూపర్ డిలక్స్ చిత్రాలతో పాటు తెలుగులో యూ టర్న్ అనే చిత్రంలో నటిస్తోంది.

ఈ మద్య స్టార్ హీరో, హీరోయిన్ల చిత్రాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పై ఔత్సాహిక కళాకారులు తమదైన స్టైల్లో డ్యాన్స్ లు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అందులో కొన్ని సక్సెస్ కూడా అవుతున్నాయి. ఆ మద్య రాంచరణ్ నటించిన ‘మగధీర’ చిత్రంలో కొన్ని డైలాగ్స్ తో అందరినీ ఆకర్షించాడు ఓ చిన్న కుర్రాడు. ఆ కుర్రాడిని రాంచరణ్ ప్రత్యేక్ష కలిసి..డైలాగ్స్ విని ఎంతో సంతోషించాడు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంతలు నటించిన మూవీ ‘రంగస్థలం’ . తాజాగా ఓ చిన్న కుర్రోడు స్కూల్ డ్రెస్ వేసుకొని ‘రంగమ్మ’ పాటకు డ్యాన్స్‌ చేసిన వీడియోను ఓ నెటిజన్‌ ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ‘ఈ వీడియోను ఒక్కసారి చూసి ఊరుకోలేరు, మళ్లీ చూడాలని అనిపిస్తోంది’ అంటూ సమంత, అనసూయ, సుకుమార్‌ను ట్యాగ్‌ చేశారు.

Leave a Reply