కేటీఆర్ ను కలుసుకున్న సైనా-కశ్యప్.. వివాహ రిసెప్షన్ కు రావాలని ఆహ్వానం
Spread the love

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు  సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.ఈ సంధర్బంగా వాళ్ళు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ను కలుసుకున్నారు.డిసెంబర్ 16న నోవాటెల్ లో సాయంత్రం 6.30 గంటలకు జరగనున్న వారి వివాహ రిసెప్షన్ కు రావాల్సిందిగా కేటీఆర్ ను ఆహ్వానించారు.తను తప్పకుండా వస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు.ఈ విషయాన్నీ సైనా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. “మంత్రి కేటీఆర్ సార్ తో సమావేశం అద్భుతంగా సాగింది.తెలంగాణలో క్రీడల  అభివృద్ధి పై కూడా చర్చించాం….మీరు మా పెళ్లి రిసెప్షన్ కు హాజరవుతారని ఆశిస్తున్నా…అంటూ సైనా నెహ్వాల్ ట్వీట్ చేసింది.