ఏటీఎంలు బద్దలుకొట్టి రూ.35 లక్షలు లూటీ…
Spread the love

భారతదేశం లో ఈ మద్య కలం లో ఎక్కువగా దోపిడీలో జరుగుతున్నాయి. కేరళలో దోపిడి దొంగలు రెండు ఏటీఎంలను బద్దలుగొట్టి రూ.35 లక్షల సొత్తు దోచుకుని వెళ్లారు. ఇవాళ తెల్లవారు జామున త్రిస్సూర్, ఎర్నాకుళం జిల్లాల్లో ఈ వరుస చోరీలు చోటుచేసుకున్నాయి. ఈ రెండు చోరీలు ఒకే ముఠా పనేనని పోలీసులు భావిస్తున్నారు. తొలుత ఎర్నాకుళం జిల్లా త్రిప్పునిత్తురలో ఇరుంబనం వద్దనున్న ఓ జాతీయ బ్యాంకు ఏటీఎంను దొంగలు పగలగొట్టారు. గ్యాస్ కట్టర్ల ద్వారా ఏటీఎంను పగలగొట్టి రూ.25 లక్షలతో పరారయ్యారు. రాత్రి 2:30 సమయంలో ఈ సంఘటన జరిగినట్టు భావిస్తున్నారు. కాగా త్రిస్సూర్ జిల్లా కోరట్టిలోని ఓ ప్రయివేటు బ్యాంకు ఏటీఎం వద్ద కూడా దొంగలు ఇదే పద్ధతిని ఉపయోగించారు. గుట్టుచప్పుడు కాకుండా ఏటీఎంను పగలగొట్టి రూ.10 లక్షలు దోచుకెళ్లారు. తెల్లవారుజామున 4:30 సమయంలో ఏటీఎంను కొల్లగొట్టిన అనంతరం షట్టర్ వేసి పారిపోయినట్టు పోలీసులు పేర్కొన్నారు. కాగా దోపిడికి పాల్పడే ముందు దొంగల ముఠాలోని ఓ సభ్యుడు సీసీకెమేరాలకు పెయింట్ స్ప్రే చేసినట్టు పోలీసులు తెలిపారు.