రెండు రైళ్ల బోగీలపై దాడి చేసిన దోపిడీ దొంగలు…
Spread the love

దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. గుత్తి జీఆర్పీ స్టేషన్‌ పరిధిలోని జూటూరు-జక్కలచెరువు రైల్వేస్టేషన్ల మధ్య, జక్కలచెరువు స్టేషన్‌లో విరుచుకుపడ్డారు. రైల్వే సిగ్నల్‌ వ్యవస్థను ధ్వంసం చేసి, రెండు రైళ్ల బోగీలపై రాళ్లతో దాడి చేశారు. మారణాయుధాలతో ప్రయాణికులను భయభ్రాంతులను చేసి దోచుకున్నారు.

చిత్తూరు నుంచి కాచిగూడ వెళ్లే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ (నెం.12798) రైలు జూటూరు ఔటర్‌ వద్దకు రాగానే సిగ్నల్‌ పడకపోవటంతో నిలిచిపోయింది. ఒక్కసారిగా దుండగులు ఎస్‌-2 బోగీ వద్ద నుంచి పది బో గీలపై రాళ్లతో దాడి చేశారు. వాటిలోకి చొర బడి, మారణాయుధాలతో ప్రయాణికులను బెదిరించారు. 11 తులాల బంగారు నగలు, నగదు అపహరించారు. గుత్తి స్టేషన్‌కు రాగా నే హైదరాబాద్‌కు చెందిన చంద్రమోహన్‌, జయప్రకా్‌ష తమ వద్ద ఉన్న 11 తులాల బంగారు అభరణాలు, రూ.10 వేలను అపహరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రైల్వే పోలీసులు ఉండి కూడా రక్షణ కరువైందని ప్రయాణికులు కౌసర్‌, రమాదేవి, సురే్‌ష ఆవేదన వ్యక్తం చేశారు. గంట వ్యవధిలోనే జ క్కలచెరువు ఔటర్‌లో పథకం మేరకు దుండగులు సిగ్నల్‌ వ్యవస్థను ధ్వంసం చేయటంతో నాంపల్లి నుంచి తిరుపతి వెళ్లే 12794 రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ జక్కల చెరువు రైల్వేస్టేషన్‌ ఔటర్‌లో నిలిచిపోయింది. దుండగులు బోగీలపై రాళ్లతో దాడి చేసి, ప్రయాణికుల నుంచి బంగారు నగలు, నగదు దోచుకున్నారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులు కాచిగూడలో, రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లోని వారు తిరుపతి లో ఫిర్యాదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఆ మేరకు స్థానిక జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తుచేస్తున్నారు. సిగ్నల్‌ వ్యవస్థను ధ్వంసం చేసిన స్థలాలను రైల్వే ఎస్పీ సుబ్బారావు శుక్రవారం పరిశీలించారు. జూటూరు ఔటర్‌ వద్ద సిగ్నల్‌ వైర్లను కత్తిరించిన చోటును ఆయన పరిశీలించారు.