జియో మరో సంచలన
Spread the love

రిలయన్స్‌ గ్రూప్‌ సంస్థగా ఎదుగుతున్న రిలయన్స్‌జియో ఐపిఒ వచ్చే రెండు, మూడేళ్లలోనే ఉంటుందని మార్కెట్‌నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీ వినియోగరంగ బిజినెస్‌ను జాబితాచేసిన తర్వాత జియోసైతంఇదే జాబితాకు వస్తుంది. ఆర్‌జియో ఇప్పటికే గ్రూప్‌లోని విద్యుత్‌ వ్యాపారాన్ని రాబడుల పరంగా అధిగమించింది.

రిలయన్స్‌జియో ప్రణాళికలు మరింత విస్తరిస్తున్నాయని, మరింతపైపైకి ఎదిగితే కంపెనీ 100శాతం రిఫైనరీ కంపెనీకి అనుబంధంగా ఉండ బోదన్న భావన సైతం వ్యక్తం అవుతోంది. ముఖేష్‌ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్‌జియో ఇతర టెలికాం కంపెనీ లతో పోటీపడుతూ ట్యారిఫ్‌ యుద్దం ప్రారంభించింది. 2016 సెప్టెంబరులోనే సేవలుప్రారంభించిన తర్వాత ఇతర కంపెనీలన్నీ పడుకున్నాయనే చెప్పాలి.

దీనితో ఇకపై మరింత విస్తరణదిశగా వెళ్లేందుకుగాను జియో స్టాక్‌ మార్కెట్లలో జాబితాచేయాలని నిర్ణయించింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పెట్టుబడిదారులకు డేటా సేవలు లేదా డిజిటల్‌ సేవలు వంటివాటిపై ఎక్కువ పెట్టుబడులుపెట్టేందుకు ఆసక్తి చూపించరు. ఎందుకంటే మార్కెట్ల హెచ్చుతగ్గులకు ఆధారంగా ఇవి నడుస్తాయి.

వీటితోపాటు ఇటీవలికాలంలో జియో ఏకైక కంపెనీగా దూసుకుపోతుండటంతో దేశ విదేశాల ఇన్వెస్టర్లుసైతం ఈ కంపెనీపై మక్కువ చూపిస్తున్నారు. రిలయన్స్‌జియోను నూరుశాతం రిల్‌ అనుబంధ కంపెనీగా కొనసాగిస్తే రిల్‌ ఇన్వెస్టర్లు కొందరు డిజిటల్‌ సేవలపై ఆసక్తి చూపించే అవకాశం లేదు. అయితే ఇందుకు ఎలాంటి కటాఫ్‌ తేదీని నిర్ణయించలేదు. స్టాక్‌ మార్కెట్లలో జాబితాచేయాలంటే ముందు కంపెనీ అనుబంధ విభాగాలు, అన్నింటితోను విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతామని కంపెనీ అధికారి ఒకరు వెల్లడించారు.

రిలయన్స్‌జియో ఐపిఒ 2019 ప్రారంభంలోనే ఉండవచ్చని మరికొందరు అధికారులు చెపుతున్నారు. మార్చి 31వ తేదీతో ముగిసిన కాలానికిగాను ఆర్‌జియో 9.4 మిలియన్ల చందాదారులను అదనంగా రాబట్టి మొత్తం 18.65 కోట్లమంది చందా దారులతో అతిపెద్ద బేస్‌గా నడుస్తోంది. అదేసమయంలోఐడియా సెల్యులర్‌ కూడా 9.1 మిలియన్‌ చందాదారులను రాబట్టింద.ఇ భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఇండియాలు 8.4 మిలియన్లు, 5.6 మిలియన్ల చందాదారులను అదనంగా రాబట్టుకున్నాయి.  జియోకు కస్టమర్లను రాబట్టడమేముందు పరమావధిగా ప్రయత్నిస్తోంది. రెవెన్యూ మార్కెట్‌ వాటాలుసైతం అందుకు అనుగుణంగానే ఉండేటట్లు బేరీజువస్తోంది. కంపెనీ ఆస్తి అప్పుల పట్టీ మరింత పటిష్టంగా ఉంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ జియోపై మరింతగా పెట్టుబడులు పెడుతోంది.

తన జియోలింక్‌ సబ్‌స్క్రైబర్ల కోసం మూడు కొత్త ప్లాన్లను లాంచ్‌ చేస్తున్నట్టు రిలయన్స్‌ జియో తెలిపింది. అవే 699 రూపాయలు, 2099 రూపాయలు. 4199 రూపాయల ప్యాకేజీలు. ఈ ప్యాకేజీలన్నింటిపై రోజుకు 5జీబీ డేటాను ఆఫర్‌ చేయనున్నట్టు రిలయన్స్‌ జియో తెలిపింది. ఈ ప్యాక్‌లపై ఎలాంటి కాలింగ్‌ ప్రయోజనాలు ఉండవు. తొలి ప్లాన్ కింద 699 రూపాయలపై 5జీబీ 4జీ డేటాను కంపెనీ అందిస్తోంది. ఈ ప్లాన్‌వాలిడిటీ 28 రోజులు. కేవలం 5 జీబీ డేటా మాత్రమే కాకుండా 16 జీబీ అదనపు డేటాను జియో ఆఫర్‌ చేస్తోంది. అంటే మొత్తంగా నెలకు 156 జీబీ డేటాను యూజర్లు పొందుతారు. ఇక రెండో ప్లాన్‌ కింద పైన పేర్కొన్న ప్రయోజనాలే 98 రోజుల పాటు అందనున్నాయి. రోజుకు 5 జీబీ డేటా, ఈ ప్లాన్‌పై అదనంగా 48 జీబీ డేటాను 4జీ స్పీడులో యూజర్లకు జియో ఆఫర్‌ చేయనుంది. దీంతో మొత్తంగా 98 రోజుల పాటు 538 జీబీ డేటాతో యూజర్లు పండుగ చేసుకోవచ్చు.