రాజ్‌ తరుణ్‌ వచ్చే ఏడాదే నా పెళ్లి
Spread the love

మంచి పర్సనాలిటీ, అందం ఉంటేనే కాదు అల్లరితనం, ఎనర్జీ, బుల్లెట్ల మాదిరి దూసుకొచ్చే డైలాగులు చెప్పినా హీరోగా మంచి పెరుఉన్నది అని నిరూపించారు యువ కథానాయకుడు రాజ్‌తరుణ్‌. తెలుగులో ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన రాజ్‌తరుణ్‌ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత వరుసగా ‘సినిమా చూపిస్త మావ’, ‘కుమారి 21 ఎఫ్‌’, ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’, ‘ఈడో రకం ఆడో రకం’ తదితర సినిమాల్లో నటించారు. చివరిగా ‘లవర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజ్‌ తరుణ్‌ తన తర్వాతి సినిమా గురించి ఇంకా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో తన తదుపరి ప్రాజెక్ట్‌ గురించి, ఇతర విషయాల గురించి ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.