రైల్వేలో దాదాపు 13 వేల జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులు
Spread the love

రైల్వేలో కొలువులంటే ఎంతో మంది యువతీయువకులకు ఆసక్తి. ఈ శాఖలో ఇప్పుడు భారీ సంఖ్యలో జూనియర్‌ ఇంజినీర్‌లకు ఉద్యోగావకాశాలు వచ్చాయి. మరో రెండు రకాల పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు. రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు  మొత్తం 13,487 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రకటించిన పోస్టులు- జూనియర్‌ ఇంజినీర్‌- 12,844, జూనియర్‌ ఇంజినీర్‌ (ఐటీ)- 29, డిపో మెటీరియల్‌ సూపరింటెండెంట్‌- 227, కెమికల్‌ అండ్‌ మెటలర్జికల్‌ అసిస్టెంట్‌- 387. వీటికి 18 నుంచి 33 సంవత్సరాల లోపు ఉన్నవారు  (01.01.2019 నాటికి) అర్హులు. రాతపరీక్ష తేదీలు ఇంకా విడుదల కాలేదు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ జనవరి 2న మొదలై జనవరి 31కు ముగుస్తుంది.

డిప్లొమా/ ఇంజినీరింగ్‌ డిగ్రీ పూర్తిచేసినవారు జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులకు అర్హులు.

బీఎస్‌సీ (కంప్యూటర్‌ సైన్స్‌), బీసీఏ, బీటెక్‌ (సీఎస్‌ఈ/ఐటీ) అభ్యర్థులు జూనియర్‌ ఇంజినీర్‌ (ఐటీ) పోస్టులకు అర్హులు.

ఏదైనా డిప్లొమా/ ఇంజినీరింగ్‌ డిగ్రీ పూర్తిచేసినవారు డిపో మెటీరియల్‌ సూపరింటెండెంట్‌ పోస్టులకు అర్హులు