వైరల్‌ అవుతున్న రాయల్‌ బేబీ ఫోటోస్‌
Spread the love

ఎప్పటినుంచో అభిమానులు ఎదురు చూస్తున్న రాయల్‌ బేబీ ఫోటోలు  వచ్చేసాయి. స్వయంగా  బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ హ్యారీ,  మేఘన్‌ మార్కెల్‌ దంపతులు తమ  తొలి సంతానాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. దీంతో   ఈఫోటోలు వైరల్‌ గా మారాయి.

మగబిడ్డకు జన్మనిచ్చిన రెండు రోజుల  తరువాత బుధవారం ఉదయం ఈ కొత్త తల్లిదండ్రులు  హ్యారీ, మేఘన్‌  బుధవారం ఉదయం విండ్సోర్ కాసిల్ లోని సెయింట్ జార్జ్ హాల్ లో తొలిసారి మీడియాతో మాట్లాడారు.  ‘‘అద్భుతంగా  ఉంది. ఈ ప్రపంచంలో ఇద్దరు  బెస్ట్‌ గైస్‌ నా జీవితంలోకి వచ్చారు’’ అంటూ   మేఘన్‌ తన సంతోషాన్ని వెలిబుచ్చారు.

కాగా సోమవారం(మే-6,2019) ఉదయం 05:26 గంటలకు (స్థానిక సమయం) మేఘన్ మార్కెల్ మగబిడ్డకు జన్మనిచ్చిందని ప్రిన్స్ హ్యారీ  ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా  వెల్లడించారు. గతేడాది మే-19,2018న బ్రిటన్‌లోని బెర్క్‌ షైర్‌ కౌంటీ విండ్సర్‌ లోని సెయింట్‌ జార్జి చర్చిలో హ్యారీ, మేఘన్‌ మార్కెల్‌ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.