ప్రకాశ్‌రాజ్‌ వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటి
Spread the love

రాజకీయాల్లోకి ప్రవేశించి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలని సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ తీసుకున్న నిర్ణయానికి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సంపూర్ణ మద్దతు తెలిపారు. చక్కటి నిర్ణయం తీసుకున్నారంటూ అభినందించారు. ఆయనకు అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో కర్ణాటక నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన ప్రకాశ్‌రాజ్‌ బుధవారం నాడు కేటీఆర్‌ను ఆయన నివాసంలో కలిశారు. కేటీఆర్‌ ఆయనకు అభినందనలు తెలియజేస్తూ రాజకీయాల్లో రాణించాలని ఆకాంక్షించారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా ధైర్యంగా ముందుకొచ్చి తమకు మద్దతు ఇచ్చినందుకు ప్రకాశ్‌రాజ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.