రాజకీయాల్లో డబ్బు ప్రధానం కాదు
Spread the love

రాజకీయాల్లో డబ్బు కంటే ప్రజా బలం, ప్రేమ ముఖ్యమన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రజల మనసులో అభిమానం ఉంటే చాలు పదవులు పెద్ద విషయం కాదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో జరిగిన జనసేనపోరాట యాత్ర బహిరంగ సభలో పవన్ ఉద్వేగంగా మాట్లాడారు. 2008లో మార్పు కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు జనసేనాని. 2014లోనూ పోటీచేసే సత్తా ఉన్నా.. విభజన తర్వాత నష్టపోయిన రాష్ట్రానికి అనుభవం కలిగిన నేత ఉంటే మంచిదనే టీడీపీకి మద్దతు ఇచ్చానన్నారు. పెద్దాయన, ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉందనే చంద్రబాబును నమ్మానన్నారు.

రాజకీయాల్లో డబ్బు ప్రధానం కాదు డబ్బే ప్రధానం అనుకుంటే వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఇప్పటికే సీఎం అయ్యేవారు. దేశంలోనే ధనవంతుల్లో ఒకరైన ముఖేశ్‌ అంబానీ ప్రధాని అయ్యేవారు. డబ్బు ప్రధానం కాదు ప్రజా బలం, వారి గుండెల్లో ప్రేమే ముఖ్యమంత్రిని చేస్తుంది. అరుపులు కేకలతో పదవులు రావు.. మీ అభిమానాన్ని అర్థం చేసుకోగలను. నాకు పేపర్లు లేవు ఛానల్స్ లేవు నాకు జనసైనికులే పేపర్లు, ఛానల్స్. మీ అభిమానం ఉంటే చాలన్నారు’ పవన్.