పక్కరాజకీయాల వాళ్ళ లాగ కేకలు, అరుపులు వేయవద్దని తన వీర మహిళలకి చెప్పిన పవన్ కళ్యాణ్..
Spread the love

మన జాతీయ పతాకాన్ని రూపొందించిన స్వర్గీయ పింగళి వెంకయ్య గారికి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఘన నివాళులు అర్పించారు. గురువారం స్వర్గీయ పింగళి వెంకయ్య గారి జయంతి. ఈ సందర్భంగా గురువారం ఉదయం హైదరాబాద్ మాదాపూర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకయ్య గారి చిత్రపటానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పూలమాల వేసి, జ్యోతి వెలిగించి అంజలి ఘటించారు. స్వాతంత్య్ర పోరాటంలో వెంకయ్య గారి త్యాగ నిరతిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తోట చంద్ర శేఖర్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ శ్రీ మాదాసు గంగాధరం తదితరులు పాల్గొన్నారు.

తన నోటి నుంచి వచ్చే ప్రతి మాటను ఆచితూచి మాట్లాడతాడు.. తన గొంతు నుంచి ఒక మాట రావటానికి ముందు తాను సవాలక్ష ఆలోచిస్తాడు.. ఆ తర్వాతే తాను మాట్లాడటం జరుగుతుంది. ఇది ఆలా ఉండగా అయన యొక్క పార్టీ వీర మహిళా విభాగాల గురించి మాట్లాడుతూ మన యొక్క పార్టీ లో ఉన్న అక్క చెల్లెల్లు అందరికి నా నమస్కారం ప్రతి మహిళకి న పాదాభి వందనం ప్రతి ఒక్కరు పార్టీ యొక్క విధివిధానాలను పాటిస్తునందుకు ధన్యవాదాలు ఇకపోతే ప్రతి మహిళా రాజకీయాల్లో మాట్లాడినంత సేపు ఆచి తూచి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను ఎందుకంటె పక్కరాజకీయాల వాళ్ళని చూస్తున్నము వాళ్ళు కేకలు వేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆలా మనం చేయవద్దు ప్రతి మహిళా సమన్వయం పాటించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాము.