పవన్ కళ్యాణ్ న్యూలుక్! వైరల్ అవుతున్న ఫోటో!
Spread the love

హైదరాబాద్: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షాకింగ్ లుక్ ఒకటి తాజాగా బయటికి వచ్చింది. ఒకసారి గడ్డం పెంచి కనిపిస్తే మరోసారి, మీసాలు తీసేసి కనిపించేవారు. కానీ ఇదంతా సినిమాలలో ఉన్నప్పుడు. కానీ గత ఏడాది జనవరి నుండి సినిమాలకు దూరంగా ఉంటూ జనసేన పార్టీ కార్యకలాపాలలో, ఎన్నికల ప్రచారం లో బిజీ కావడంతో అయన తన లుక్స్ పై పెద్దగా శ్రద్ధ తీసుకోలేదు.

వెయిట్ పెరగడం తో పాటుగా జుట్టు పెంచారు, అలాగే గడ్డం కూడా బాగా పెంచేశారు. కానీ తాజాగా పవన్ కళ్యాణ్ లుక్ చూస్తే మాత్రం ఎవరైనా షాక్ తినాల్సిందే. గడ్డం పొడవాటి జుట్టు అలానే ఉంది కానీ పూర్తిగా స్లిమ్ గా మారిపోయారు.

పవన్ కళ్యాణ్ గత కొద్దిరోజులుగా ఇండియాలో లేరని,వేసవి వెకేషన్ కోసం విదేశాలకు వెళ్ళారని వార్తలు వచ్చాయి. కానీ , పవన్ ఎక్కడికి వెళ్ళారో మాత్రం ఎవరికీ తెలియదు. తాజాగా అయన ఎక్కడి నుంచో తిరిగి వస్తూ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు.

లైట్ బ్లూ కలర్ షర్టు, జీన్స్ ప్యాంట్ లో ఉన్న పవన్ స్లిమ్ గా కనిపించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి పవన్ కళ్యాణ్ తన గడ్డం ఎప్పుడు తీసేస్తారో ఇంకా తెలీదు. ఎలెక్షన్ రిజల్ట్ తర్వాతే పవన్ క్లీన్ షేవ్ లుక్ లో కనిపిస్తారని సమాచారం. మరో రెండు రోజుల్లో పవన్ విజయవాడ కు వెళ్తారని అక్కడ పార్టీ వర్గాలతో భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చలు జరుపుతారని తెలుస్తోంది.