తెలంగాణలో ఎవరికి ఓటు వేయాలో చెప్పిన పవన్ కల్యాణ్…
Spread the love

తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల మీద జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, త్యాగాలను పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తిని తానని… అందుకే తనకు తెలంగాణ అంటే ఎనలేని గౌరవమని పవన్ కల్యాణ్ తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ముందుగా రావడంతో సమయం తక్కువగా ఉండటం వల్ల, ఎక్కువ సమయాన్ని తాను కేటాయించలేకపోవడం వల్ల తెలంగాణా లో జనసేన పోటీ చేయలేకపోయిందని తెలిపారు.

తెలంగాణను ఇచ్చామనేవాళ్లు, తెలంగాణను తెచ్చామనేవాళ్లు, తెలంగాణను దించామనేవాళ్లు ఇప్పుడు మన ముందు ఉన్నారని… వారిలో ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి వేయరాదనే అయోమయంలో అందరూ ఉన్నారని తెలిపారు. ఎక్కువ పారదర్శకత, తక్కువ అవినీతితో ఎవరైతే మంచి పాలనను అందిస్తారో… లోతుగా ఆలోచించి వారికి ఓటు వేయాలని పవన్ కళ్యాణ్ తెలిపారు.

Posted by Pawan Kalyan on Wednesday, December 5, 2018