రూ.70 వేల ఫోన్‌ కేవలం రూ.11వేలకే!
Spread the love

 

ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ కొత్తగా మరో సేల్‌ను ప్రారంభించింది. సూపర్‌ వాల్యు వీక్‌ పేరుతో నేటి నుంచి ఈ సేల్‌కు తెరలేపింది. నేటి నుంచి ప్రారంభమైన ఈ సేల్‌ జూన్‌ 24 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా కొత్త స్మార్ట్‌ఫోన్లపై నో కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్లు, బైబ్యాక్‌ గ్యారెంటీలు, డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లను ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేస్తోంది. గూగుల్‌ పిక్సెల్‌ 2, ఐఫోన్‌ 6, ఐఫోన్‌ ఎక్స్‌, ఐఫోన్‌ 8 ప్లస్‌, మోటో ఎక్స్‌4 వంటి పాపులర్‌ మొబైల్‌ ఫోన్లను ఈ సేల్‌లో అందుబాటులో ఉంచింది.

ఫ్లిప్‌కార్ట్‌ సూపర్‌ వాల్యు వీక్‌ సేల్‌…

సూపర్‌ వాల్యు వీక్‌ సేల్‌ కింద, ఫ్లిప్‌కార్ట్‌ పిక్సెల్‌ 2 స్మార్ట్‌ఫోన్‌పై భారీగా ధర తగ్గించింది. బైబ్యాక్‌ గ్యారెంటీతో పిక్సెల్‌ 2 128 జీబీ మోడల్‌ కేవలం 10,999 రూపాయలకే అందుబాటులో ఉంచింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర 70వేల రూపాయలు. అయితే ఈ ఆఫర్‌ పొందాలంటే, వినియోగదారులు తొలుత రూ.199తో బైబ్యాక్‌ గ్యారెంటీ పాలసీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ ఈ ఫోన్‌పై 9,001 రూపాయల డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది. దీంతో పిక్సెల్‌ 2 ఫోన్‌ ధర 60,999 రూపాయలకు దిగొచ్చింది. అదేవిధంగా హెచ్‌డీఎఫ్‌ డెబిట్‌, క్రెడిట్‌ కార్డుదారులకు అదనంగా మరో 8వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ లభిస్తోంది.

ఈ క్యాష్‌బ్యాక్‌తో పిక్సెల్‌ 2 ధర రూ.52,999కు తగ్గింది. వీటితో పాటు ఆరు నుంచి ఎనిమిది నెలల కాలంలో రూ.42 వేల ఎక్స్చేంజ్‌ వాల్యును కొనుగోలు దారులను పొందుతారు. ఇలా పిక్సెల్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.10,999కు పడిపోయింది. పిక్సెల్‌ 2, 128 జీబీ వేరియంట్‌పైనే కాక, ఫ్లిప్‌కార్ట్ తన పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ 64 జీబీ మోడల్‌పై కూడా రూ.37 వేల బైబ్యాక్‌ గ్యారెంటీని ఆఫర్‌ చేస్తోంది. 128 జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌ వేరియంట్‌పై రూ.44 వేల బైబ్యాక్‌ను అందిస్తోంది. ఇదే రకమైన ఆఫర్‌ను మోటో ఎక్స్‌4కు కూడా అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో భాగంగా మోటో ఎక్స్‌4 స్మార్ట్‌ఫోన్‌ రూ.6999కు లభ్యమవుతోంది. ఈ హ్యాండ్‌సెట్‌ అసలు ధర 22,999 రూపాలయు. బైబ్యాక్‌ గ్యారెంటీతో పాటు , ఫ్లిప్‌కార్ట్‌ పలు స్మార్ట్‌ఫోన్లపై ‘ఈజీ నో కాస్ట్‌ ఈఎంఐ’ ను కూడా ఆఫర్‌ను చేస్తోంది.