బేబీ పాటకు నెటిజన్లు ఫిదా……
Spread the love

‘ఓ చెలియా నా ప్రియసఖియా’ అంటూ ‘ప్రేమికుడు’ చిత్రంలో నగ్మా, ప్రభుదేవాలపై చిత్రీకరించిన ఈ లవ్ సాంగ్‌ వచ్చి 24 ఏళ్లు గడుస్తున్నా.. క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.అయితే ఈ సాంగ్ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. కారణం బేబీ అనే ఓ మట్టిలో మాణిక్యం. ఈమె పాటకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలోని వడిశలేరు గ్రామానికి చెందిన పసల బేబీ అనే మహిళ తన గానామృతంతో ఈ పాటకు వన్నెతెచ్చారు. ‘ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే అంటూ పాపులర్ సింగర్స్‌ సైతం ఔరా అనేలా ఈ పాటను ఎంతో శ్రావ్యంగా ప్రొఫెషనల్ సింగర్‌లా పాడి వైరల్‌గా మారింది. ఈ వీడియోకి ఫేస్‌బుక్‌లో 11 వేల లైకులు, 14,389 షేర్లు దక్కగా ఎనిమిదన్నర లక్షల మంది చూశారు. ఇక యూట్యూబ్‌లో సైతం లక్షల్లో వ్యూస్ లభించాయి.

super singer

Posted by Veerababu Ache Singer on Sunday, 28 October 2018