మైకేల్ జాక్సన్ తండ్రి కన్నుమూత
Spread the love

లాస్‌వెగాస్‌: ప్రపంచ ప్రఖ్యాత పాప్‌ సింగర్‌ దివంగత మైకేల్‌ జాక్సన్‌ తండ్రి జోరు జాక్సన్‌ (89) మృతి చెందారు. జోరు గతకొంతకాలంగా పాంక్రి యాటిక్‌ క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ లాస్‌ వెగాస్‌ లోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని మైకేల్‌ జాక్సన్‌ మాజీ అధికార ప్రతినిధి రేమోనే బైన్‌, జోరు మనవడు రాండీ జాక్సన్‌లు ధ్రువీకరించారు. జోరు మరో మనవడు తేజ్‌ జాక్సన్‌ కూడా ట్విటర్‌ ద్వారా విషయాన్ని వెల్లడించారు. జోరు తన పిల్లల్లో చక్కని ప్రతిభ ఉందని గుర్తించి ‘జాక్సన్‌ 5’ పేరుతో 1960ల్లోనే మ్యూజిక్‌ ట్రూప్‌ ఏర్పాటు చేశారు. దానికి ఆయనే మేనేజర్‌గా వ్యవహరిస్తూ వారిని సంగీత ప్రపంచంలోకి తీసుకొచ్చారు. ఇందులో మైకేల్‌ జాక్సన్‌ ఉన్నారు. అప్పుడు ఆయన వయసు ఎనిమిదేండ్లు. ఆ తర్వాతి కాలంలో మైకేల్‌ జాక్సన్‌, జోరు కూతురు జానెట్‌ జాక్సన్‌లు గొప్ప పాప్‌ సింగర్‌లుగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.