మద్యం తాగి పోలింగ్ స్టేషన్‌కు వస్తే అరెస్ట్..
Spread the love

తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్‌ సమయం దగ్గరపడుతుండడంతో ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పోలింగ్ ముగిసే వరకు మద్యపానం నిషేధ౦ (డ్రైడే) అమల్లో ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు.పోలింగ్ కేంద్రాల వద్ద ధూమపానాన్ని నిషేధించింది.పోలింగ్ కేంద్రాల వద్ద స్టిక్కర్లు కూడా అంటించారు.మద్యం సేవించి ఎవరైనా పోలింగ్ కేంద్రానికి వస్తే అరెస్ట్ చేయాలని ఆదేశించారు.

ఈ రోజు సాయంత్రంతో ప్రచారాలు ముగియనున్నాయి.సమయం ముగిసిన తరువాత కూడా ఏ రాజకీయ పార్టీలు సమావేశాలు,సభలు,నిర్వహించకూడదని,ఏ రూపంలోను ప్రచార ప్రకటనలను ప్రసారం చేయకూడదని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ తెలిపారు.ప్రజల దృష్టిని ఆకర్షించే కార్యక్రమాలు కూడా చేయకూడదని ఎన్నికల నిబంధనలను తప్పకుండా పాటించాలని ఎవ్వరైన అతిక్రమిస్తే రెండేళ్ల జైలు శిక్ష,జరిమానా అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు.